ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్‌ఏఐ అడ్వాన్స్ ఫీచర్లతో కొత్త చాట్‌జీపీటీ వెర్షన్(జీపీటీ-4ఓమ్ని)ను విడుదల చేసింది. ఇందులో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరామురాటీ తెలిపారు.
ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ..‘జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్ రెండింతలు వేగంగా పనిచేస్తుంది. దీని సబ్‌స్క్రిప్షన్ ధర జీపీటీ4 టర్బో కంటే తక్కువగా ఉంటుంది. మరికొన్ని వారాల్లో ఈ వెర్షన్‌ను అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నాం. అయితే, వారికి కొన్ని పరిమితులుంటాయి. పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవు. ఈ కొత్త మోడల్ దాదాపు 50 భాషలను సపోర్ట్ చేస్తుంది. వీటిలో తెలుగు, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ వంటి భారతీయ భాషలు ఉన్నాయి. వాయిస్ కమాండ్లకు కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుంది. టెక్ట్స్, రీజనింగ్, కోడింగ్ ఇంటెలిజెన్స్‌లో టర్బో వెర్షన్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. తర్వలో యాపిల్ మ్యాక్‌ఓఎస్ యూజర్లకు డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేయనున్నాం. మరికొన్ని రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అనే కృత్రిమ మేధతో చాట్‌జీపీటీను 2015లో సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, ఇలియా సుట్స్‌కేవర్, వోజ్‌సీచ్ జరెంబా స్థాపించారు. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లో రూ.8,345 కోట్లు పెట్టుబడి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment