ChatGPT-4
-
చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!
కృత్రిమ మేధ (AI) రంగం కొత్తపుంతలు తొక్కుతూ శరవేగంగా పురోగతి సాధిస్తున్న సమయంలో.. రెండు ప్రముఖ టెక్ కంపెనీల మధ్య పోటీకి దారితీసింది. కృత్రిమ మేధ ఫలాలను సామాన్యులకు సైతం పరిచయం చేసి, టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ‘చాట్‌జీపీటీ(ChatGPT)’కి పోటీగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్(X)’అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్(Grok)’తెరపైకి దూసుకొస్తోంది. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్ఏఐ’సంస్థ ద్వారా గత ఏడాది నవంబర్ 3న ‘గ్రోక్’ను మార్కెట్లోకి తెచ్చారు. చాట్‌జీపీటీ, గ్రోక్ రెండూ ఏఐ టూల్స్ అయినా రెండింటి మధ్య ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. తమకు ‘గ్రోక్’బాగా నచ్చిందని, ‘చాట్‌జీపీటీ’సబ్‌స్క్రిప్షన్‌ను వదిలేసుకుని ఇకపై గ్రోక్నే వినియోగిస్తామని ‘ఎక్స్’లో కొందరు పోస్టులు పెడుతుండగా.. ఎలన్ మస్క్ వాటిని షేర్ చేస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజానికి కృత్రిమ మేధ రంగంలో అగ్రగామిగా ఉన్న ‘చాట్‌జీపీటీ’కి గ్రోక్ పోటీ ఇవ్వగలదా అన్నది భవిష్యత్తులో తేలిపోనుంది.ప్రస్తుతానికి చాట్జీపీటీదే ఆధిపత్యం..‘గ్రోక్’తాజా వెర్షన్‌కు ఆధారం ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్–2 మోడల్. ఉచితంగా ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్న ఇతర టూల్స్‌తో పోల్చితే పనితీరు, సామర్థ్యంలో ఇది ముందంజలో ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని అంశాల్లో ‘చాట్‌జీపీటీ’ఉచిత వెర్షన్ (GPT 3.5)ను సైతం గ్రోక్ అధిగమించినట్టు పలు పరీక్షల్లో తేలిందని అంటున్నారు. అయితే ‘చాట్‌జీపీటీ ప్లస్’వెర్షన్లో ఉపయోగించే ‘జీపీటీ–4’మోడల్ సామర్థ్యంతో పోల్చితే ‘గ్రోక్’వెనకబడే ఉందని స్పష్టం చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కువ కాలం నుంచి కొనసాగుతుండటంతో పాటు గణనీయ స్థాయిలో డేటాతో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో చాట్‌జీపీటీ ప్రత్యేకంగా నిలుస్తోందని.. వినియోగదారులకు అవసరమైన సేవల నుంచి సృజనాత్మక రచనల వరకు విస్తృత శ్రేణిలో సృజన చూపగలుగుతోందని పేర్కొంటున్నారు.హాస్యాన్ని మేళవించి.. సమాచారం అందించే గ్రోక్..గ్రోక్ హాస్యాన్ని మేళవించి సరదా సంభాషణలతో, కొంతవరకు తిరుగుబాటు వైఖరిని కూడా మేళవించి సమాధానాలు ఇస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఇతర ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన ప్రశ్నలకు సైతం సమాధానమిచ్చేలా దీనిని రూపొందించామని అంటున్నారు. రాజకీయ అంశాల విషయంలో గ్రోక్ ధోరణి అందరికి నచ్చకపోవచ్చని.. అందుకే రాజకీయంగా పూర్తిగా సరైనది కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చాట్‌జీపీటీ తటస్థంగా, మర్యాదపూర్వకంగా, సమగ్రమైన ధోరణిలో స్పందిస్తుంది.రియల్ టైమ్‌లో గ్రోక్ పైచేయిగ్రోక్ సామాజిక మాధ్యమం ఎక్స్ నుంచి రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి వర్తమాన అంశాలు, సరళులపై తాజా సమాచారాన్ని అందించగలుగుతుంది. అవసరమైతే ఇంటర్నెట్లోనూ రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది. ఈ అంశంలో గ్రోక్ ముందంజలో ఉంది. చాట్‌జీపీటీ అత్యంత శక్తివంతమైనదే అయినా ‘గ్రోక్’తరహాలో రియల్ టైమ్ అప్డేషన్ లేదు. కటాఫ్ తేదీ (2021)కి ముందు నాటి సమాచార పరిజ్ఞానాన్ని మాత్రమే చాట్‌జీపీటీ వినియోగించి సేవలు అందిస్తుంది. అయితే డబ్బులు చెల్లించి సబ్ర్‌స్కయిబ్ చేసుకునే ప్రీమియం వెర్షన్ (చాట్‌జీపీటీ ప్లస్) దీనికి మినహాయింపు.గ్రోక్ ‘ఎక్స్’లోనే.. జీపీటీ అన్నిచోట్లా..గ్రోక్ ప్రస్తుతం ‘ఎక్స్’యాప్‌లోనే సమ్మిళితమై సేవలందిస్తోంది. అంటే ‘ఎక్స్’వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి ఉంది. దీనిని తొలుత ‘ఎక్స్ (ట్విట్టర్)’ప్రీమియం ప్లస్, ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అనంతరం కొన్ని పరిమితుల మేరకు ఉచిత వినియోగదారులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో ‘ఎక్స్’ప్రీమియం, ప్రీమియం ప్లస్ చందాలు కట్టాల్సిన అవసరం లేకుండా.. ‘గ్రోక్’కే చందా కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని రూపకర్తలు చెబుతున్నారు.మరోవైపు ‘చాట్‌జీపీటీ–3.5’పాత వెర్షన్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. వినియోగదారులకు మరింత విస్తృతమైన సేవలందించే అత్యాధునిక ‘జీపీటీ–4’వెర్షన్‌కు మాత్రం డబ్బులు చెల్లించి సబ్‌్రస్కయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని వెబ్, మొబైల్ యాప్స్, ఎంఎస్ ఆఫీస్ ద్వారా విస్తృత రీతిలో పొందవచ్చు.దేనికది ప్రత్యేకంకంటెంట్ సృష్టి, అనువాదం, కస్టమర్ సపోర్ట్, విద్య, వ్యక్తిగత సహాయం, కోడింగ్, మేధోమథనం వంటి వైవిధ్యభరిత సేవలను విస్తృతరీతిలో చాట్‌జీపీటీ అందిస్తోంది. వినియోగదారులు టెక్ట్స్‌తోపాటు చిత్రాలను ఇన్‌పుట్‌గా వాడే సదుపాయాన్ని చాట్‌జీపీటీ ప్లస్ కలి్పస్తోంది. నిర్దిష్టమైన పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కస్టమైజ్డ్ సేవలను సైతం చాట్‌జీపీటీ అందిస్తోంది.ఇక ‘గ్రోక్’విషయానికి వస్తే సామాజిక మాధ్యమాలతో అనుసంధానం, రియల్ టైమ్ సమాచారం, వినోదం, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు వంటి సేవలను వినూత్న రీతిలో అందిస్తోంది. ‘గ్రోక్’ను అగ్రగామిగా నిలపాలనే వ్యూహంతో ఎలన్ మస్క్ భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యభరిత సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెబుతున్నారు కూడా.ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?‘గ్రోక్’పేరు ఎందుకు‘గ్రోక్’అనే ఆంగ్ల పదానికి అర్థం ‘ఎవరినైనా/ఏదైన అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం’. రాబర్ట్ ఎ.హెన్లీన్ తన సైన్స్‌ఫిక్షన్ నవల ‘స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్’లో వాడిన ‘గ్రోక్’పదం నుంచి స్ఫూర్తి పొందిన ఎలన్‌మస్క్ తన ఏఐ టూల్‌కు ఈ పేరును పెట్టారు. -
చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐ ‘చాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.గూగుల్‌లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్‌లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్‌జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్‌జీపీటీలోనూ డిస్ప్లే అవుతుంది. విభిన్న వెబ్సైట్లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్‌జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్‌జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.కొత్తగా పరిచయం చేసిన చాట్‌జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్‌టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్‌సైట్‌ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్‌లో అడిగిన కమాండ్‌కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్‌ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..
ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్ఏఐ అడ్వాన్స్ ఫీచర్లతో కొత్త చాట్‌జీపీటీ వెర్షన్(జీపీటీ-4ఓమ్ని)ను విడుదల చేసింది. ఇందులో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరామురాటీ తెలిపారు.ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ..‘జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్ రెండింతలు వేగంగా పనిచేస్తుంది. దీని సబ్స్క్రిప్షన్ ధర జీపీటీ4 టర్బో కంటే తక్కువగా ఉంటుంది. మరికొన్ని వారాల్లో ఈ వెర్షన్‌ను అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నాం. అయితే, వారికి కొన్ని పరిమితులుంటాయి. పెయిడ్ సబ్స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవు. ఈ కొత్త మోడల్ దాదాపు 50 భాషలను సపోర్ట్ చేస్తుంది. వీటిలో తెలుగు, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ వంటి భారతీయ భాషలు ఉన్నాయి. వాయిస్ కమాండ్లకు కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుంది. టెక్ట్స్, రీజనింగ్, కోడింగ్ ఇంటెలిజెన్స్‌లో టర్బో వెర్షన్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. తర్వలో యాపిల్ మ్యాక్ఓఎస్ యూజర్లకు డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేయనున్నాం. మరికొన్ని రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అనే కృత్రిమ మేధతో చాట్‌జీపీటీను 2015లో సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, ఇలియా సుట్స్కేవర్, వోజ్సీచ్ జరెంబా స్థాపించారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లో రూ.8,345 కోట్లు పెట్టుబడి పెట్టింది. -
వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి!
డాక్టర్లు చేయలేని పనిని అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్ చాట్‌జీపీటీ చేసింది. ప్రాణ ప్రాయ స్థితులో ఉన్న మూగజీవి ప్రాణాలు కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ట్విటర్ యూజర్ కూపర్ Cooper (@peakcooper) ఓపెన్ఐకి చెందిన చాట్‌జీపీటీ లేటెస్ట్ వెర్షన్ జీపీటీ-4 ఏఐ తన కుక్క ‘సాసీ’(Sassy) ప్రాణాల్ని కాపాడిందని ట్వీట్ చేశారు. Tick-borne జబ్బుతో కుక్కల్లో పేలు బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా Tick-borne అనే జబ్బు చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అనారోగ్య సమస్య కారణంగా మూగజీవాల్లో ఆకలి లేకపోవడం, శోషరస గ్రంథులు ఉబ్బడం, కీళ్ల వాపులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శరీరంలోని లోపలి భాగాల్లో రక్తస్త్రావం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. నచ్చని వైద్యుల సలహా అయితే కూపర్ పెంపుడు కుక్క సాసీ Tick-borneతో అనారోగ్యం పాలైంది. అత్యవసర చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాడు. రక్తహీనత ఏర్పడి అనారోగ్యం పాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సతో ఆరోగ్యం కుదుట పడింది. కానీ కొన్ని రోజులకు ఆరోగ్యం యధావిధికి చేరింది. దీంతో చేసేది లేక మరోసారి ఆస్పత్రికి తరలించి టిక్-బోర్న్ పరీక్షలు చేయించాడు. రిపోర్ట్ నెగిటీవ్ వచ్చింది. కుక్క ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఆ సలహా కూపర్‌కు నచ్చలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చాట్‌జీపీటీ-4 సాయంతో అదే సమయంలో టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారిన చాట్ జీపీటీని ఆశ్రయించాడు. తన కుక్క సాసీ అనారోగ్య సమస్యను చాట్‌జీపీటీ-4కి వివరించాడు. అందుకు జీపీటీ తాను వెటర్నరీ డాక్టర్‌ను కాదంటూనే..కుక్కకి తీసిన బ్లడ్ శాంపిల్స్‌తో మీ కుక్క ఎందుకు అనారోగ్యం పాలైందోనని అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తానని తెలిపింది. In the meantime, it occurred to me that medical diagnostics seemed like the sort of thing GPT4 could potentially be really good at, so I described the situation in great detail. I gave it the actual transcribed blood test results from multiple days, and asked for a diagnosis 4/ pic.twitter.com/K7kqaGnyAd — Cooper ☕ (@peakcooper) March 25, 2023 సాసీ అనారోగ్యానికి కారణం ఇదే వెంటనే కుక్క ఎందుకు అనారోగ్యం పాలైందో తెలుపుతూ జబ్బులకు సంబంధించిన లక్షణాల గురించి చాట్‌జీపీటీ-4 ఓ డేటాను అందించింది. చాట్‌జీపీటీ చెప్పిన అనారోగ్య సమస్యలు సాసీలో ఉన్నాయని బదులివ్వడంతో..మీ కుక్క ఇమ్యూన్-మెడియేటెడ్ హెమోలిటిక్ అనీమియా (IMHA) అనే సమస్యతో బాధపడుతుందని సూచించింది. చాట్‌జీపీటీ-4 చెప్పింది.. వైద్య చరిత్రలో ఇదో అద్భుత ఘట్టం! దీంతో రెండో సారి ఆశ్రయించిన వైద్యులతో సాసీకి ఐఎంహెచ్‌ఏ సమస్య ఏమైనా ఉందా? అని కూపర్ ప్రశ్నించాడు. అదే అనుమానాన్ని రక్తపరీక్ష చేసిన వైద్యులు నిజం చేశారు. కుక్క ఐఎంహెచ్‌ఏ సమస్య తలెత్తిందని.. కాబట్టే ఆరోగ్యం క్షీణించిందని నిర్ధారించారు. ప్రస్తుతం సాసీ ఆరోగ్యం కుదుట పడిందంటూ చాట్‌జీపీటీతో చేసిన సంభాషణ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. #GPT4 saved my dog's life. After my dog got diagnosed with a tick-borne disease, the vet started her on the proper treatment, and despite a serious anemia, her condition seemed to be improving relatively well. After a few days however, things took a turn for the worse 1/ — Cooper ☕ (@peakcooper) March 25, 2023 ఆశ్చర్యంలో 9 మిలియన్ల మంది యూజర్లు కూపర్ ట్విట్లను 9 మిలియన్ల మంది యూజర్లు వీక్షించారు. పెంపుడు జంతువు యజమానికి చాట్‌జీపీటీ-4 ఎలా సహాయం చేసిందో తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 వాళ్ల ఉద్యోగాలు ఊడడం ఖాయం.. చాట్ జీపీటీ సృష్టికర్త సంచలన వ్యాఖ్యలు