ఇజ్రాయెల్ కేంద్రంగా ఆపరేషన్
అడ్డుకున్న ఓపెన్‌ఏఐ
న్యూఢిల్లీ: భారత్‌లో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ముందు ఓపెన్ ఏఐ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. ప్రజల అభిప్రాయాలను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కృత్రిమంగా ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ కేంద్రంగా జరిగిన కోవర్ట్ ఆపరేషన్‌ను అడ్డుకున్నట్టు చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ ప్రకటించింది. అధికార బీజేపీని విమర్శిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ప్రశంసిస్తూ ‘ఎస్‌టీవోఐసీ’ అనే రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ భారత ఎన్నికలపై కంటెంట్‌ను రూపొందించినట్టు తెలిపింది.
‘‘భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీని విమర్శిస్తూ, కాంగ్రెస్‌ను పొగుడుతూ అభిప్రాయాలను ఎస్‌టీవోఐసీ మే నెలలో వ్యాప్తిలోకి తెచి్చంది. 24 గంటల్లోనే దీన్ని అడ్డుకున్నాం’’అని ఓపెన్‌ఏఐ వెల్లడించింది. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్ వేదికలపై ఓ సమూహంతో కూడిన అకౌంట్ల ద్వారా కంటెంట్ ఎడిట్, ప్రసారం చేసినట్టు, అలాంటి ఖాతాలను నిషేధించినట్టు ఓపెన్ ఏఐ ఓ నివేదిక రూపంలో బయటపెట్టింది. తమ ఏఐ టూల్స్ సాయంతో కథనాలు, అభిప్రాయాలను రూపొందించి వాటిని ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లలో పోస్ట్ చేసినట్టు పేర్కొంది. ఈ ఆపరేషన్‌కు ‘జీరో జెనో’ అని పేరు పెట్టింది. ఏఐని సురక్షిత అవసరాలకే వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ఆపరేషన్‌ను విచి్ఛన్నం చేసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment