ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే! | AI Powered Camera Can Turn Pictures Into Poems; Check The Details | Sakshi
Sakshi News home page

ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!

Published Fri, May 10 2024 5:55 PM | Last Updated on Fri, May 10 2024 6:05 PM

AI Powered Camera Can Turn Pictures Into Poems; Check The Details

ఒకప్పుడు ఫోటో తీయాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. టెక్నాలజీ బాగా పెరిగిన తరువాత స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఫోటోలు తీయడం చిటికెలో పని అయిపోయింది. ఇవన్నీ కాదని నేడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నలజీతో ఓ కెమెరా అందుబాటులోకి వస్తోంది.

కెలిన్ కరోలిన్ జాంగ్, ర్యాన్ మాథెర్‌ రూపొందించిన ఈ కెమెరా ఫోటో తీయగానే.. దానికి తగినట్లు ఉండే ఓ కవితను రాసేస్తుంది. ఒకప్పుడు కవులు బుర్రలకు పదునుపెట్టి.. సమయాన్ని వెచ్చించి అద్భుతంగా కవితలు రాసేవారు. కానీ నేడు ఈ కెమెరాతో ఫోటో తీస్తే కవిత రాసేస్తుంది.

ఫొటోలో కనిపించే రంగులు, మనుషులు, వస్తువులను వర్ణిస్తూ ఏఐ కెమెరా కవిత రాస్తుంది. రాసిన వెంటనే ఓ చిన్న చీటీ మీద ప్రింట్‌ తీసి బయటకు కూడా పంపిస్తుంది. కవితలు రాయడానికి ఓపెన్ఏఐ జీపీటీ-4ని ఉపయోగిస్తుంది. వినియోగదారు ఇందులో సొనెట్‌లు, చిన్న పద్యాలు, హైకూ వంటి ఆప్షన్స్ కూడా ఎంచుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement