ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్‌.. ఎక్కడంటే.. OpenAI released its ChatGPT app for MacOS as a free download | Sakshi
Sakshi News home page

ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్‌.. ఎక్కడంటే..

Published Thu, Jun 27 2024 11:40 AM | Last Updated on Thu, Jun 27 2024 12:53 PM

OpenAI released its ChatGPT app for MacOS as a free download

యాపిల్‌ మాక్‌ ఓఎస్‌ కలిగిన ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ జనరేటివ్‌ ఏఐ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇన్ని రోజులు సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్నవారికే అందించిన చాట్‌జీపీటీ ప్లస్‌ సేవలను యాపిల్‌ మాక్‌ ఓఎస్‌ వినియోగిస్తున్న వారికి ఇకపై ఫ్రీగా అందిస్తారని చెప్పింది.

యాపిల్‌ మాక్‌ ఓఎస్‌ 14, ఆపై వర్షన్లను వాడుతున్న యాపిల్‌ మాక్‌ వినియోగదారులు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ డెస్క్‌టాప్‌ యాప్‌ను ఓపెన్‌ఏఐ వెబ్‌సైట్‌లో https://openai.com/chatgpt/mac/ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పింది.

ఇదీ చదవండి: ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీ

ఇటీవల యాపిల్‌ నిర్వహించిన వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్‌ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్‌ సంస్థ ‘యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్‌ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెడుతామని కంపెనీ ఈ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి విడుదలయ్యే కొత్త యాపిల్‌ ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను అందించనున్నట్లు చెప్పింది. మాక్‌ ఓఎస్‌ 14 తర్వాత వర్షన్‌ల్లో డెస్క్‌టాప్‌ యాప్‌ను ఉచితంగా వినియోగించుకునేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement