
‘దిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే!’ అని ఊరకే అనలేదు. ‘అమ్మా... పెద్ద విజయం సాధించాను’ అని చెప్పినా సరే... ‘సంతోషం’ అంటూనే ‘ఇంతకీ భోజనం చేశావా?’ అని ఆరా తీస్తుంది. తల్లికి పిల్లల విజయాల కంటే వారి ఆరోగ్యం, క్షేమం ముఖ్యం. ఇట్టి విషయాన్ని మరోసారి నిరూపించిన స్క్రీన్ షాట్ గురించి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’లో అన్షితా సైనీ గ్రోత్ ఇంజినీర్. చాట్‌జీపీటీ కోసం ఆమె అభివృద్ధి చేసిన ఫీచర్ ‘టెక్ క్రంచ్’ హైలెట్ అయింది. ఇది ఆమె కెరీర్‌లో ఒక ప్రధాన మైలు రాయిగా చెప్పవచ్చు.
తన విజయం గురించి ఒక టెక్ పత్రికలో వచ్చిన వ్యాసం లింక్‌ను తల్లికి పంపించింది అన్షిత. ‘నేను రూపొందించిన ఫీచర్ గురించి పత్రికలో గొప్పగా రాశారు’ అని తల్లికి టెక్ట్స్ మెసేజ్ ఇచ్చింది. ‘నైస్... గ్రేట్ ఇన్‌స్పిరేషన్’ అని బదులు ఇచ్చిన వెంటనే...‘నీ ఫీచర్ సంగతి సరే... ఈరోజు తినడానికి నీ దగ్గర నట్స్, ఫ్రూట్స్ ఉన్నాయా?’ అని అడిగింది. చాట్‌లో తల్లి అడిగిన ప్రశ్న స్క్రీన్‌షాట్ తీసి ‘ఎక్స్’లో షేర్ చేసింది అన్షిత. దీనికి కొన్నిగంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment