ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ హవా కొనసాగుతుంది. ఈ తరుణంలో ఓపెన్‌ఏఐ కంటే సమర్ధవంతంగా సేవలందిస్తున్న భారత్‌కు చెందిన ఏఐ స్టార్టప్ భారత్‌జీపీటీలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కోరోవర్ ఈ ఏడాది ప్రారంభంలో చాట్‌జీపీటీ తరహాలో భారత్‌జీపీటీని విడుదల చేసింది. 12 కంటే ఎక్కువ భారతీయ భాషలతో పాటు 120 విదేశీ భాషల్లో సేవల్ని అందిస్తుంది. అయితే చాట్‌జీపీటీ కంటే భారత్ జీపీటీ పనితీరు అద్భతమంటూ టెక్నాలజీ నిపుణులు కొనియాడుతున్నారు.
ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ 95 భాషల్లో సేవల్ని అందిస్తుంది. ఎక్కువ శాతం ఇంగ్లీష్‌లోనే యూజర్ల అవసరాల్ని తీరుస్తుంది. టెక్స్ట్‌ని హ్యాండిల్ చేసే చాట్‌జీపీ వలె కాకుండా ఫోటోలు, ఆడియో, వీడియో, మ్యాప్‌లతో సహా విభిన్న డేటా ఫార్మాట్‌లలో దీని సేవలు వినియోగించుకోవచ్చు.
భారత్ జీపీటీ 90 శాతం ఖచ్చితత్వాన్ని కలిగి ఉందని కోరోవర్ తెలిపింది. ప్రస్తుతం వన్ బిలియన్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ తరుణంలో గూగుల్ కోరోవర్‌లో 4 బిలియన్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఏఐ విభాగంలో భారత్ సైతం సత్తా చాటడంలో ఏమాత్రం అతిశయోక్తం కాదని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment