ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది.
తాజాగా ఓపెన్ఏఐ తన ఎల్ఎల్ఎంలకు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లేకుండానే తమ బుక్స్‌ను వాడుతోందని ఆరోపిస్తూ కొద్దినెలల కిందట వందలాది రచయితలు టెక్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే తరహాలో జొనాస్ బ్రదర్స్ సహా 200 మందికిపైగా మ్యూజీషియన్లు ఏఐకి వ్యతిరేకంగా గళం విప్పారు. తమ హక్కులను ఉల్లంఘించే పద్ధతులను నిలిపివేయాలని కోరుతూ ఏఐ కంపెనీలకు బహిరంగ లేఖ రాశారు. తమ కళను హరించకూడదంటూ అందులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’
ఆర్టిస్ట్స్ రైట్స్ అలయన్స్ ఆధ్వర్యంలో రాసిన ఈ లేఖపై జొనాస్ సోదరులు, బిల్లీ ఇలిష్, క్యాటీ పెర్రీ, స్మోకీ రాబిన్సన్ వంటి ప్రముఖ ఆర్టిస్ట్‌లు సంతకాలు చేశారు. మ్యూజిక్ పరిశ్రమలో ఏఐ వినియోగంతో తలెత్తే దుష్ప్రభావాలపై ఈ లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగంతో సృజనాత్మకత దెబ్బతింటుందని, ఆర్టిస్టులు, హక్కుదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఏఐ డెవలపర్లు, టెక్నాలజీ కంపెనీలు, డిజిటల్ వేదికలకు వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment