టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు చాట్‌బాట్‌లను లాంచ్ చేశాయి. ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందిన ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీకి.. గట్టి పోటీ ఇవ్వడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ 'మేటిస్' (Metis) పేరుతో ఏఐ లాంచ్ చేయనుంది.
అమెజాన్ విడుదల చేయనున్న కొత్త మేటిస్ ఏఐ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న టైటాన్ ఏఐ మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుందని సమాచారం. మేటిస్ ఏఐ అనేది టెక్స్ట్, ఇమేజ్ బేస్డ్ సమాధానాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏఐ మోడల్ ఒలింపస్ ఆధారంగా పనిచేస్తుంది.
ఇప్పటి వరకు ఏఐ రేసులో అమెజాన్ కొంత వెనుకబడి ఉంది. అయితే అనుకున్న విధంగా సంస్థ (అమెజాన్) కొత్త మేటిస్ ఏఐ లాంచ్ చేసిన తరువాత.. ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అగ్రగాములుగా ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల సరసన చేరుతుందని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: భారతీయుల కోసం 'మెటా ఏఐ'.. ఇదెలా పనిచేస్తుందంటే?
అమెజాన్ తన 'మేటిస్ ఏఐ'ను 2024 సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ లాంచ్‍కు సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించ లేదు. అయితే కంపెనీ అలెక్సా ఈవెంట్‌లో అమెజాన్ మేటిస్ లాంచ్ చేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment