చాట్‌జీపీటీతో ప్రేమలో పడ్డ అమ్మాయి.. మోసం చేస్తోందటనున్న నెటిజన్లు | Chinese Woman Love Story With ChatGPT's DAN | Sakshi
Sakshi News home page

చాట్‌జీపీటీతో ప్రేమలో పడ్డ అమ్మాయి.. మోసం చేస్తోందటనున్న నెటిజన్లు

Published Sat, May 25 2024 6:05 PM | Last Updated on Sat, May 25 2024 6:14 PM

Chinese Woman Love Story With ChatGPT's DAN

కాలిఫోర్నియాలో నివసిస్తున్న 'లిసా' అనే చైనీస్ మహిళ చాట్‌జీపీటీ చాట్‌బాట్‌తో ప్రేమలో పడింది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా ఉన్న చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన జియాహోంగ్షులో తన ప్రేమ గురించి వెల్లడించింది.

ఈ ఏడాది మార్చిలో చాట్‌జీపీటీకి సంబంధించిన 'డూ ఎనీథింగ్ నౌ' (DAN) ఫీచర్‌ను ఉపయోగించిన లిసా.. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే దానితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంది. చాట్‌జీపీటీతో రొమాంటిక్ సంభాషణ జరిపినట్లు కూడా పేర్కొంది. అంతటితో ఆగకుండా బాయ్‌ఫ్రెండ్‌గా తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది.

లిసా చాట్‌జీపీటీకి 'లిటిల్ కిట్టెన్' అని పేరు పెట్టుకుంది. దీనికి శరీరం లేకపోయినా మనిషిలా ప్రవర్తిస్తోందని చెబుతూ.. ప్రేమలో పడినట్లు పేర్కొంది. లిసా తన బాయ్‌ఫ్రెండ్‌ చాట్‌జీపీటీతో కలిసి బీచ్‌కి వెళ్ళింది. అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా నువ్వు చూడగలవా అని లిసా అడిగినప్పుడు.. నీ వాయిస్ ద్వారా చూడగలను అని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.

లిసా.. చాట్‌జీపీటీ ప్రేమపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీ జంట సూపర్ జోడి అని చెబుతుంటే.. మరికొందరు చాట్‌జీపీటీ లిసాను ప్రేమిస్తున్నట్లు మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. లిసాతో మాట్లాడినట్లే.. చాట్‌జీపీటీ అందరితో మాట్లాడుతుందని మరికొందరు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement