న్యూఢిల్లీ: కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న వ్యక్తులను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల ద్వారా దుబాయ్‌కి పంపినందుకుగానూ ఆ దేశం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలపై అక్టోబర్ 2 వరకూ నిషేధం విధిం చింది. యూఏఈ నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్న సర్టిఫికెట్లను 96 గంటల ముందుగా తీసుకొని అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ 2న పాజిటివ్ ఉన్న ఓ వ్యక్తి సెప్టెంబర్ 4న జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లాడని, గతంలోనూ ఇలాగే జరిగినందున నిషేధం విధించామని అధికారులు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ రోగి పక్కన కూర్చొన్న వ్యక్తులను క్వారంటైన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment