
దాదాపు ఏడు దశాబ్ధాల తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ తిరిగి టాటాల సొంతమైంది. జంషెడ్‌జీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం జాతీయం చేసింది. కొంత కాలం బాగానే నడిచినా చివరకు రాజకీయ జోక్యం పెరిగిపోవడం, నిర్వాహన లోపాల కారణంగా నష్టాల పాలైంది. అప్పుల కుప్పగా మారిన ఎయిరిండియాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాని సమయంలో మరోసారి ధైర్యం చేశారు రతన్‌టాటా. తన తండ్రి కలల ప్రాజెక్టయిన ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గూటికి చేర్చాడు.
ప్రభుత్వం నుంచి టాటాపరమైన తర్వాత తొలి ఫ్లైట్ ఈ రోజు టాటాల ఆధ్వర్యంలో నడిచింది. ఈ సందర్భంగా తమ విమానంలో ప్రయాణిస్తున్న వారికి మొదటి సారిగా వినిపించిన అనౌన్స్‌మెంట్‌ని టాటా మీడియాకు రిలీజ్ చేసింది. ఈ అనౌన్స్‌మెంట్ ‘ డియర్ గెస్ట్, నేను మీ కెప్టెన్‌ను మాట్లాడుతున్నాను.. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న విమానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.. అంటూ మొదలు పెట్టి వెల్‌కమ్ టూ ది ఫ్యూచర్ ఆఫ్ ఎయిర్ ఇండియా! వి హోప్ యూ ఎంజాయ్ ది జర్నీ అంటూ ముగిసింది.
Air India's new circular for cockpit crew welcome announcements: "Dear guests, welcome aboard this historic flight, which marks a special event. Today, Air India officially becomes a part of Tata Group again, after seven decades. Welcome to the future of Air India." pic.twitter.com/GsiXy07I1V
— ANI (@ANI) January 27, 2022
Comments
Please login to add a commentAdd a comment