రోడ్లపై ప్రయాణాల్లో అలసటగా అనిపించినా, బోర్ కొట్టినా కాసేపు వాహనాన్ని ఆపి సేదతీరుతారు. కానీ విమాన ప్రయాణాల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఒకసారి గాల్లోకి ఎగిరాక తిరిగి దిగేవరకు ప్రయాణం ఎలా ఉన్నా భరించాల్సిందే. పైగా విమాన ప్రయాణాలంటేనే గంటల తరబడి ఉంటాయి. గాల్లో ప్రయాణించేవారికి కాసింత వినోదాన్ని పంచేందుకు థేల్స్ సంస్థ సిద్ధమయింది. ఇప్పటికే ఫ్లైట్ సీట్ ముందు డివైజ్‌ను అమర్చి ప్రయాణికులను కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్న సంస్థ ఆ వ్యవస్థను ఆధునికీకరించనుంది.
ఎయిరిండియా తమ వద్ద ఉన్న 40 బోయింగ్ 777, 787 విమానాలను, థేల్స్‌కు చెందిన ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చనుంది. థేల్స్ ‘అవాంట్ అప్’ వ్యవస్థను ఎయిరిండియా విమానాల లోపల అమర్చే పనులు వచ్చే ఏడాది వరకు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది. 2025లో ఎయిరిండియాకు కొత్తగా డెలివరీ అయ్యే 11 కొత్త ఎయిర్‌బస్, బోయింగ్ విమానాల్లోనూ థేల్స్ తన కొత్త వ్యవస్థలను పొందుపరచనుంది.
ఇదీ చదవండి: యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే..
థేల్స్ 3డీ మ్యాప్, ఇమ్మర్సివ్ రూట్-బేస్డ్ ప్రోగ్రామింగ్, 4K QLED HDR డిస్‌ప్లేలను ఇన్‌స్టాల్ చేయనుంది. ఇందులో హై-స్పీడ్ ఛార్జింగ్ పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏరోనాటిక్స్-స్పేస్, డిజిటల్ ఐడెంటిటీ-సెక్యూరిటీ, డిఫెన్స్-సెక్యూరిటీ విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న కంపెనీగా థేల్స్ పేరొందింది.
Comments
Please login to add a commentAdd a comment