Tata Owned Air India Offers VRS For Permanent Employees - Sakshi
Sakshi News home page

టాటా సంచలన నిర్ణయం! ఎయిరిండియా ఉద్యోగులు ఇక ఇంటికే!

Published Thu, Jun 2 2022 1:24 PM | Last Updated on Thu, Jun 2 2022 8:57 PM

Tata Owned Air India Offers Vrs For Permanent Employees - Sakshi

దేశీయ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. పర్మినెంట్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ (స్వచ్ఛంద విరమణ) ఆఫర్‌ ఇచ్చింది. వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రోత్సహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. వారి స్థానంలో కొత్తగా ఉద్యోగుల్ని నియమించుకోనుంది. 


సుమారు 70 ఏళ్ల తర్వాత ఎయిరిండియాను టాటా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏవియేషన్‌ సెక్టార్‌లో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఎయిరిండియాను తీర్చిదిద్దనుంది. ఈనేపథ్యంలో టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిరిండియాలో 55 సంవత్సరాల వయస్సున్న(గతంలో 40 ఏళ్లు) క్యాబిన్‌ క్రూ సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ తీసుకోవచ్చని తీసుకోవచ్చని ప్రకటించారు.  

ఎవరైతే జూన్‌1 నుంచి జులై 31వరకు స్వచ్ఛంద రాజీనామా చేస్తారో ఆ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒకేసారి టాటా గ్రూప్‌ ఎక్స్‌ గ్రేషియా, బోనస్‌లు ఇవ్వనున్నట్లు ఎయిరిండియా చీఫ్‌ హెచ్‌ ఆర్‌ విభాగం అధికారి సురేష్‌ దత్‌ త్రిపాటీ చెప్పారు. 

గతేడాది ప్రకటన 
గతేడాది బిడ్‌ జరిగిన అక్టోబర్‌ నెలలో ఉద్యోగుల వీఆర్‌ఎస్‌, తొలగింపుపై ఎయిరిండియా ముందస్తుగానే తెలిపింది. నాటి లెక్కల ప్రకారం.. ఎయిరిండియాలో మొత్తం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 8,084మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 4,001 కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌లో 1,534 మంది ఉద్యోగులు  విధులు నిర్వహిస్తున్నట్లు ఎయిరిండియా సీఎండీ రాజీవ్‌ బన్సాల్‌ ఓ నివేదికను విడుదల చేశారు. కేంద్రం నిర్వహణలో ఉన్న ఎయిరిండియాను తాము దక్కించుకుంటే సంవత్సరం పాటు ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని అన్నారు. రెండో ఏడాదిలో ఉద్యోగులు తొలగించడం, వీఆర్‌ఎస్‌కు అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

ఆ ఉద్యోగులకు నష్టమే
పలు నివేదికల ప్రకారం..ఎయిరిండియాలో వచ్చే 5 ఏళ్లలో సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున మొత్తం 5వేల మంది ఉద్యోగులు రిటైర్‌ కానున్నారు. ఇక వీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సిన వారిలో పర్మినెంట్‌ ఉద్యోగులతో పాటు, ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌లో పైలెట్‌లను మినహాయించి మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వర్తించనుంది. ఈ వీఆర్‌ఎస్‌ నిర్ణయమే ఉద్యోగులకు నష్టమేనన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement