
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ క్యారియర్ ఎయిరిండియా ఓ ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. అందరూ మహిళా సిబ్బందితోనే కోల్‌కత్తా-డిమాపూర్-కోల్‌కత్తా సెక్టార్‌లో ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తోంది. ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో విమానం ఏఐ709, ఎయిర్‌బస్ 319కు కాక్‌పిట్ సిబ్బందిగా కెప్టెన్ ఆకాంక్ష వర్మ, కెప్టెన్ సతోవిసా బెనర్జీ వ్యవహరిస్తున్నారని, క్యాబిన్ సిబ్బందిగా డి భుటియా, ఎంజీ మోహన్రాజ్, టీ ఘోస్, యతటిలి కత్‌లు ఉన్నారని తెలిపింది.
ఎయిరిండియా జనరల్ మేనేజర్, పర్సనల్ నవ్‌నీత్ సిధు, ఇతర సీనియర్ సిబ్బంది కలిసి ఈ విమానానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వీకంతా పలు ఈవెంట్లను ఈ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారి అంతా మహిళా సిబ్బందితో కూడా విమానాన్ని 1985లో ఎయిరిండియా నడిపింది. అత్యంత పొడవైన మార్గం ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో-ఢిల్లీ రూట్‌లో కూడా అంతా మహిళా సిబ్బందితో ఎయిరిండియా ఓ ప్రత్యేక విమానాన్ని నడిపి, ప్రపంచ రికార్డును సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment