బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పీవో పోస్టులు | job point | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పీవో పోస్టులు

Published Wed, Aug 3 2016 8:25 AM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పీవో పోస్టులు - Sakshi

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పీవో పోస్టులు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 400 పీవో పోస్టులు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. బరోడా మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌తో కలిసి 9 నెలల పోస్టుగ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారిని జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌/ స్కేల్‌–1 ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమిస్తారు. ఉద్యోగంలో చేరిన వెంటనే మూడు నెలల వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ (డబ్ల్యూఐఎల్‌) పేరుతో శిక్షణ ఇస్తారు. దీన్ని పూర్తిచేసుకున్నవారికి మణిపాల్‌ యూనివర్సిటీ.. పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.

అర్హత: ఆగస్టు 31, 2016 నాటికి 60 శాతం (ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 55 శాతం) మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌/బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఆగస్టు 1, 2016 నాటికి కనీసం 20 ఏళ్లు ఉండాలి. 28 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. దివ్యాంగులు (ఎస్సీ, ఎస్టీ), (ఓబీసీ), (జనరల్‌)కు వరుసగా 15 ఏళ్లు, 13 ఏళ్లు, 10 ఏళ్లు సడలింపు ఇస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌), సైకోమెట్రిక్‌ అసెస్‌మెంట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వూ్య ద్వారా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్‌ పరీక్ష: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ అవేర్‌నెస్‌ (బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ సంబంధిత), ఇంగ్లిష్‌ల నుంచి ఒక్కో విభాగంలో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులు కేటాయిస్తారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌: ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లో నిర్దేశిత మార్కులు సాధించినవారికి 30 నిమిషాల వ్యవధిలో ఆన్‌లైన్‌లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇది డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 50. అభ్యర్థులు ప్రతి టెస్ట్‌లోనూ నిర్దేశిత మార్కులు, మొత్తం మార్కులు సాధించాల్సి ఉంటుంది. మార్కులు ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వూ్య నిర్వహిస్తారు. సైకోమెట్రిక్‌ టెస్ట్‌ అర్హత పరీక్ష మాత్రమే. ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌; గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

కోర్సు ఫీజు: అన్నీ కలుపుకుని రూ.3.45 లక్షలు. కోర్సుకు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి 8 శాతం వడ్డీకి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విద్యా రుణం మంజూరు చేస్తుంది. దీన్ని అభ్యర్థులు ఏడేళ్లలో (84 నెలల్లో) నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.100, ఇతరులు రూ.600 క్రెడిట్‌ కార్డ్‌/డెబిట్‌ కార్డ్‌/ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 2, 2016
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు రుసుం చెల్లింపు తేదీలు: ఆగస్టు 2 – 21
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 21, 2016
కాల్‌ లెటర్స్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబర్‌ 2016
పరీక్ష తేది: సెప్టెంబర్‌ 25, 2016

వెబ్‌సైట్‌: www.bankofbaroda.co.in, http://ibps.sifyitest.com/bmsbpojaug16/

మిలటరీ నర్సింగ్‌ సర్వీసులోకి..మహిళలకు ఆహ్వానం
సైన్యంలోని వైద్య విభాగంలో పనిచేయాలనే ఆసక్తి గల మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ (ఎస్సెస్సీ) ఆఫీసర్ల నియామకానికి మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌(ఎంఎన్‌ఎస్‌)–2016 నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్తి వివరాలు..
విద్యార్హత, రిజిస్ట్రేషన్‌: ఎంఎస్సీ(నర్సింగ్‌)/పోస్ట్‌ బేసిక్‌ (పీబీ) బీఎస్సీ(నర్సింగ్‌)/బీఎస్సీ(నర్సింగ్‌)తోపాటు స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్స్‌మిడ్‌వైఫ్‌గా నమోదు కావాలి.

గమనిక: ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌ కాపీలను ఇంటర్వ్యూ కి తీసుకురావాలి.
వయసు: 1981 ఆగస్టు 2 నుంచి 1995 ఆగస్టు 3 వరకు (ఈ మధ్య కాలంలో) జన్మించినవారు అర్హులు.
ఫిజికల్‌ ఫిట్‌నెస్‌: వైద్య పరీక్షలు జరిగే తేదీ నాటికి గర్భిణిగా ఉన్నవారిని ‘టెంపరర్లీ మెడికల్లీ అన్‌ఫిట్‌’గా పరిగణిస్తారు. అంటే వారిని సర్వీసులోకి తీసుకోరు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ కి, మెడికల్‌ టెస్ట్‌
రాత పరీక్ష: సెప్టెంబర్‌ మొదటి/రెండో వారంలో ఉంటుంది. పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం వివరాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో వెల్లడిస్తారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. వీటిని నర్సింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ ఇంటలిజెన్స్‌పై రూపొందిస్తారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు.   

ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌: అక్టోబర్‌లో నిర్వహిస్తారు. ఢిల్లీలో జరిగే ఈ ఇంటర్వ్యూలకి ‘ఒక్కో పోస్టుకు ముగ్గురికి మించకుండా’ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వూ్య, వైద్య పరీక్షలకు 2 నుంచి 5 రోజులు పడుతుంది. ఈ సమయంలో వసతి బాధ్యత అభ్యర్థులదే. ఇంటర్వూ్యలో కనబరిచిన ప్రతిభ, వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు.
వైవాహిక స్థితి: అవివాహిత/వివాహిత/విడాకులు తీసుకున్న లేదా చట్టబద్ధంగా విడిపోయిన/వితంతువు

ఉద్యోగ కాల వ్యవధి: ఎస్సెస్సీ ఆఫీసర్‌గా ఎంపికైతే తొలుత ఐదేళ్లు సేవలందించాలి. ఈ వ్యవధిని పూర్తి కాలానికి (5+5+4=14 ఏళ్లకు) పొడిగించే అవకాశం ఉంది. వీళ్లు రెగ్యులర్‌ ఆఫీసర్ల మాదిరిగా దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఫలానా ప్రాంతంలో పోస్టింగ్‌ కావాలని కోరే అవకాశం (ఆప్షన్‌) తొలి ఐదేళ్లలో ఇవ్వరు.

జీతభత్యాలు: ప్రి కమిషనింగ్‌ ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాక లెఫ్టినెంట్‌ ర్యాంక్‌ ఇస్తారు. ఆ సమయంలో నెలకు బేసిక్‌ రూ.15,600; గ్రేడ్‌ పే రూ.5,400; మిలటరీ సర్వీస్‌ పే రూ.4,200; డీఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి.

పదోన్నతులు: ఎస్సెస్సీ ఆఫీసర్లు తొలుత ‘లెఫ్టినెంట్‌’గా; 3 ఏళ్ల తర్వాత ‘కెప్టెన్‌’గా; 8 ఏళ్ల తర్వాత ‘మేజర్‌’గా ప్రమోషన్‌ పొందుతారు. పర్మనెంట్‌ కమిషన్‌ నర్సింగ్‌ ఆఫీసర్లు లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్‌ కల్నల్, కల్నల్, బ్రిగేడ్, మేజర్‌ జనరల్‌ తదితర హోదాలు పొందొచ్చు.
పర్మనెంట్‌ కమిషన్‌: ఎస్సెస్సీ ఆఫీసర్లను ఖాళీలు, నిబంధనలకు అనుగుణంగా పర్మనెంట్‌ నర్సింగ్‌ ఆఫీసర్లుగా నియమించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్‌ ఫాంను నింపే విధానం, పేమెంట్, అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తదితర వివరాల కోసం ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ www.joinindianarmy.nic.inను సందర్శించొచ్చు.  
చివరి తేది: ఆగస్టు 3.
దరఖాస్తు రుసుం: రూ.200 చెల్లించాలి.  

హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌
హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) అధీనంలోని బయో ఫ్యూయల్స్‌ లిమిటెడ్‌ (బీఎఫ్‌ఎల్‌).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను జారీ చేసింది. ఇకపై హెచ్‌బీఎల్‌గా కార్యకలాపాలను కొనసాగించనున్న ఈ సంస్థ.. మొత్తం 60 రకాల పోస్టుల భర్తీకి ఇంటర్వూ్యలను నిర్వహించనుంది. ఈ ఖాళీలన్నింటినీ ముఖ్యంగా మూడు కేటగిరీలుగా విభజించారు. ఒకటి.. మేనేజ్‌మెంట్‌. ఈ కేటగిరీలో 29 ఖాళీలు ఉన్నాయి. రెండు.. నాన్‌ మేనేజ్‌మెంట్‌. ఈ కేటగిరీలో 43 పోస్టులు ఉన్నాయి.. మూడు.. సీజనల్‌. ఈ కేటగిరీలో 66 వేకెన్సీలు ఉన్నాయి. మొదటి రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల కాంట్రాక్ట్‌ కాల వ్యవధి రెండేళ్లు. హెచ్‌బీఎల్‌ నిర్వహణ ఆవశ్యకత, అభ్యర్థి పనితీరును బట్టి కాంట్రాక్ట్‌ పీరియడ్‌ను అవసరమైతే మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. మూడో కేటగిరీ (సీజనల్‌) పోస్టుల కాంట్రాక్ట్‌ కాల పరిమితి ఒక క్రషింగ్‌ సీజన్‌. సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరును బట్టి ఈ గడువును కూడా మరో క్రషింగ్‌ సీజన్‌ వరకు పొడిగించే వీలుంది.

ఇంటర్వ్యూ కి తేదీలు: మేనేజ్‌మెంట్‌ పోస్టులకు ఆగస్టు 8, 9, 10. నాన్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులకు ఆగస్టు 22, 23. సీజనల్‌ పోస్టులకు ఆగస్టు 25, 26.
ఇంటర్వ్యూ వేదిక: హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌ హౌజ్‌ నంబర్‌ 271, రోడ్‌ నంబర్‌ 3ఇ, న్యూ పాటలీపుత్ర కాలనీ, పాట్నా, 800013.
విద్యార్హత, అనుభవం: ఒక్కో పోస్టుకు ఒక్కో విద్యార్హతను, నిర్దేశిత అనుభవాన్ని పేర్కొన్నారు. వివరాలకు www.hpclbiofuels.co.in/ home.phpలో చూడొచ్చు.
వేతనం: వేతనాలు; అలవెన్సులు; ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ కలిపి సంస్థ.. ఉద్యోగిపై వెచ్చించే ఖర్చు (సీటీసీ–కాస్ట్‌ టు కంపెనీ)ని వార్షిక ప్రాతిపదిక పేర్కొన్నారు. వాటిని కేటగిరీల వారీగా పరిశీలిస్తే..
వయసు: వయోపరిమితి నిర్థారణకు 2016 ఆగస్టు 1ని కటాఫ్‌ డేట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. మూడు కేటగిరీల పోస్టులకూ కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు మేనేజ్‌మెంట్‌ పోస్టులకు 57 ఏళ్లు; నాన్‌ మేనేజ్‌మెంట్, సీజనల్‌ ఉద్యోగాలకు 55 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తిచేసి; విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌ కాపీలతో ఇంటర్వూ్యకి హాజరుకావాలి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే ఇంటర్వూ్యకి రావాలి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఇంటర్వూ్యకి వస్తే అతడి/ఆమె అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోరు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైనవారిని వేతన చర్చ (నెగోషియేషన్‌ ఆఫ్‌ సీటీసీ)కి ఎంపిక చేస్తారు. అందులోనూ సక్సెస్‌ అయినవారికి మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ మూడు పరీక్షలతోపాటు విద్యార్హత, వయసు, రిజర్వేషన్‌ కేటగిరీ, ఎన్‌ఓసీ, రిలీవింగ్‌ లెటర్‌ తదితర పత్రాలన్నింటినీ పరిశీలించిన తర్వాత తుది ఎంపిక చేస్తారు.

కేటగిరీ                             గరిష్టం(రూ.లక్షల్లో)     కనిష్టం(రూ.లక్షల్లో)
మేనేజ్‌మెంట్‌                       8–10                 1.80–2.50
నాన్‌ మేనేజ్‌మెంట్‌              1.80–2.40          1.44–1.80
సీజనల్‌                              1.80–2.40          1.20–1.80

ఎయిరిండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌
విమానాల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలను నిర్వర్తించే ఎయిరిండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌).. గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్యానెల్‌ ఏర్పాటుకు ‘గేట్‌’ స్కోర్‌ కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 382 ఉండగా ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి.. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజనీర్‌. రెండు.. ఇంజనీరింగ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌. వేకెన్సీ వివరాలు కేటగిరీల వారీగా..
1. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజనీర్‌
కేటగిరీ    ఎస్సీ    ఎస్టీ    ఓబీసీ    ఓసీ    మొత్తం    
ఖాళీలు    41      21       75      143      280
2. ఇంజనీరింగ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌
కేటగిరీ    ఎస్సీ    ఎస్టీ    ఓబీసీ    ఓసీ    మొత్తం    
ఖాళీలు    15       7        27    53         102

ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజనీర్‌ పోస్టులకు: 2016 జూలై 1 నాటికి బీఈ/ బీటెక్‌లో మెకానికల్‌/ఏరోనాటికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/టెలికమ్యూనికేషన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(లేదా) తత్సమాన విద్యార్హతతోపాటు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (‘గేట్‌’)లో 80 శాతం అంతకన్నా ఎక్కువ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 75 శాతం, అంతకన్నా ఎక్కువ) స్కోర్‌ ఉండాలి.

ఇంజనీరింగ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌ పోస్టులకు: 2016 జూలై 1 నాటికి బీఈ/బీటెక్‌లో మెకానికల్‌/ఏరోనాటికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రా నిక్స్‌/టెలీకమ్యూనికేషన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఇండస్ట్రియల్‌/ప్రొడక్షన్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌ (లేదా) తత్సమాన విద్యార్హతతోపాటు ‘గేట్‌’లో 80 శాతం అంతకన్నా ఎక్కువ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 70 శాతం అంతకన్నా ఎక్కువ) స్కోర్‌ ఉండాలి.
వయసు: 2016 జూలై 1 నాటికి ఓసీలు 28 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు, ఎస్సీ/ ఎస్టీలు 33 ఏళ్ల లోపు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లు 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్లకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

వేతనం
ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజనీర్‌ పోస్టులకు: మొదటి ఏడాది శిక్షణలో రూ.25,000 సై్టపెండ్‌ చెల్లిస్తారు. రెండో ఏడాది శిక్షణలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 30,000 వేతనం ఉంటుంది. లైసెన్స్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజనీర్‌గా క్వాలిఫై అయ్యే వరకు ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ అనంతరం పదోన్నతుల్లోని స్థాయిలను, క్వాలిఫికేషన్లను బట్టి నెలకు రూ. లక్షకుపైగా వేతనం, ఇంక్రిమెంట్లు ఉంటాయి.

సపోర్ట్‌ సర్వీసెస్‌ పోస్టులకు: మొదటి ఏడాది శిక్షణలో రూ.25,000 సై్టపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం పెర్ఫార్మెన్స్‌ అసెస్‌మెంట్‌/లెవల్‌ ఎగ్జామినేషన్‌ను బట్టి అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌ ఇస్తారు. ఈ సమయంలో సర్వీస్‌ వ్యవధి/అనుభవం ఆధారంగా ఐదేళ్లపాటు నెలకు రూ.40,000–55,000 వేతనం ఉంటుంది.          

సర్వీస్‌ బాండ్‌
ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజనీర్‌(ఏఎంఈ) పోస్టులకు: శిక్షణను విజయవంతగా పూర్తిచేస్తానని, ఏఎంఈ లైసెన్స్‌ పొందిన తర్వాత కనీసం 5 ఏళ్లపాటు సంస్థలో పనిచేస్తానని ఒప్పంద పత్రం సమర్పించాలి.
ఇంజనీరింగ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌ పోస్టులకు: శిక్షణను విజయవంతగా పూర్తిచేస్తానని, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌ ఇచ్చిన తర్వాత కనీసం 5 ఏళ్లపాటు సంస్థలో పనిచేస్తానని ఒప్పంద పత్రం సమర్పించాలి.
ఎంపిక విధానం: ఇంటర్వూ్య ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఇంటర్వూ్యకి సెలెక్ట్‌ అయిన అభ్యర్థుల పేర్లను సంస్థ వెబ్‌సైట్‌లోని కెరీర్‌ పేజీలో అందుబాటులో ఉంచుతారు.  
దరఖాస్తు విధానం: రెండు రకాల పోస్టులకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తు ప్రింటౌట్‌కు విద్యార్హతలు, వయసు, వ్యక్తిగత గుర్తింపు, గుర్తింపు, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌), గేట్‌ స్కోర్‌ తదితర ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను, ఒరిజినల్‌ బ్యాంక్‌ చలాన్‌ను జతచేసి కింది అడ్రస్‌కు పంపాలి.
చిరునామా: పోస్ట్‌ బాక్స్‌ నంబర్‌ 12006, కాస్సిపోర్‌ పోస్టాఫీస్, కోల్‌కతా, 700002.    
దరఖాస్తు రుసుం: రూ.2000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఉంది.
ముఖ్య తేదీలు: ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్‌ 2016 ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ల హార్డ్‌ కాపీలను 2016 సెప్టెంబర్‌ 30 లోపు పంపాలి. ఇంటర్వూ్యకి ఎంపికైన అభ్యర్థుల పేర్లను 2016 నవంబర్‌ 15న  (లేదా) ఆ తర్వాత వెల్లడిస్తారు.  
వెబ్‌సైట్‌: www.airindia.in

‘ఎయిర్‌లైన్స్‌’69 కో పైలట్‌ పోస్టులు
ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఏఏఎస్‌ఎల్‌) కాంట్రాక్ట్‌ విధానంలో 69 కో పైలట్‌ (పీ2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హతలు: ఆగస్టు 22, 2016 నాటికి అభ్యర్థులకు కనీసం 18 ఏళ్లు ఉండాలి. 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్‌/వర్సిటీ నుంచి ఇంటర్‌/+2 ఉత్తీర్ణులై ఉండాలి. డీజీసీఏ జారీ చేసిన, ప్రస్తుతం చెల్లుబాటయ్యే కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) కలిగి ఉండాలి. అభ్యర్థులకు వీటితోపాటు నిర్దేశిత అర్హతలుండాలి.
ఎంపిక విధానం: ఎంపిక చేసిన అభ్యర్థులకు సైకోమెట్రిక్‌ టెస్ట్‌ (అర్హత టెస్ట్‌), సిములేటర్‌ ప్రొఫిషియెన్సీ అసెస్‌మెంట్‌ చెక్‌ (ఎస్‌పీఏసీ) నిర్వహిస్తారు. సిములేటర్‌ రుసుమును అభ్యర్థులే చెల్లించాలి. ఎస్‌పీఏసీలో అర్హత సాధించిన వారిని, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 5 ఏళ్ల కాలానికి ఉద్యోగం కల్పిస్తారు. ప్రతిభ ఆధారంగా మరో 5 ఏళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. ఢిల్లీ/కోల్‌కతా/బెంగళూరు/హైదరాబాద్‌/ముంబై/ భోపాల్‌లో పోస్టింగ్‌ ఉంటుంది.
దరఖాస్తు విధానం: www.airindia.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును ప్రింట్‌ తీసుకుని, నిర్దేశిత నమూనాలో పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి ‘ద ఆఫీస్‌ ఆఫ్‌ ఈడీ (ఎన్‌ఆర్‌), ఎయిర్‌ ఇండియా లిమిటెడ్, టెర్మినల్‌–1బీ, ఐజీఐ ఎయిర్‌పోర్ట్, న్యూఢిల్లీ–110037 అడ్రస్‌కు పంపాలి. ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీస్‌ పేరుతో రూ.3,000 డీడీని కూడా దరఖాస్తుతోపాటు పంపించాలి. ఎస్సీ, ఎస్టీలకు డీడీ అవసరం లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 22, 2016
సై్టపెండ్, వేతనం: శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.25,000 సై్టపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్వీస్‌ సమయంలో నెలకు రూ. 2,11,000 వేతనం లభిస్తుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:www.airindia.in

డీఆర్‌డీఓ, ఏడీఏ 182 పోస్టులు
డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)లో సైంటిస్ట్‌ ‘బి’, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ)లో సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘బీ’ ఉద్యోగాల భర్తీకి సవరణ ప్రకటన వెలువడింది. ‘ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ 2016 మార్చి 5–11 సంచిక’లో ప్రచురించిన (రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌–ఆర్‌ఏసీ వెబ్‌సైట్‌తోపాటు డీఆర్‌డీఓ వెబ్‌సైట్‌లోనూ పొందుపర్చిన) ప్రకటన నంబర్‌–120 ప్రకారం ఈ రెండు సంస్థల్లో మొత్తం 17 ఐటమ్స్‌(సబ్జెక్టులు/డిసిప్లైన్ల)లో 163 ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిలో ఐదు ఐటమ్‌లకు సంబంధించిన ఖాళీల సంఖ్య 112 మాత్రమే. ఇప్పుడు ఆ ఐదు ఐటమ్స్‌లోని ఖాళీలను పెంచుతూ సవరణ ప్రకటన ఇచ్చారు. పాత నోటిఫికేషన్‌లోని ఐటం నంబర్‌ 1, 2, 3, 6, 7లలో మొత్తం పోస్టులు 112 ఉండగా వాటికి మరో 70 పోస్టులు కలవడంతో ఖాళీల సంఖ్య 182కు పెరిగింది. (17 ఐటమ్స్‌లోని ఖాళీల సంఖ్య 163 నుంచి 233కు చేరుతుంది). కాగా ఈ ఐదు ఐటమ్స్‌లోని ఖాళీలకు గతంలో అప్లై చేసినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. కొత్తవారు మాత్రమే ఈ ఐదు ఐటమ్స్‌లోని ఖాళీలకే అప్లై చేయాల్సి ఉంటుంది. గతంలో పేర్కొన్న ఖాళీల సంఖ్య, ప్రస్తుత వేకెన్సీ వివరాలు సబ్జెక్టు, కేటగిరీల వారీగా..

ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టులకు గేట్‌–2015/2016 స్కోర్‌ ఆధారంగా స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. ‘ఒక పోస్టుకు ఐదుగురు అభ్యర్థులు’ చొప్పున(1:5 నిష్పత్తిలో) తదుపరి ఎంపిక ప్రక్రియ (పర్సనల్‌ ఇంటర్వ్యూ)కి సెలెక్ట్‌ చేస్తారు. గేట్‌ స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వూ్యకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులకు అభ్యర్థులు సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. పర్సనల్‌ ఇంటర్వూ్యలో జనరల్‌ అభ్యర్థులు కనీసం 70 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాలి.
విద్యార్హత: కనీస విద్యార్హత, సంబంధిత గేట్‌ పేపర్‌ కోడ్, క్వాలిఫైయింగ్‌ డిగ్రీలోని తత్సమాన సబ్జెక్టుల జాబితా కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చు.     
వయసు: వయో పరిమితి నిర్థారణకు 2016 ఏప్రిల్‌ 10ని కటాఫ్‌ తేదీగా పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ట వయో పరిమితి 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆర్‌ఏసీ వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.
చివరి తేదీ: ఆన్‌లైన్‌ అప్లికేషన్లను 2016 ఆగస్టు 10లోపు దాఖలు చేయాలి.
వెబ్‌సైట్‌: http://rac.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement