క్రూ మెంబర్లతో దురుసుగా ప్రవర్తించినందుకు ఓ ప్రముఖ కంపెనీ ఛైర్‌పర్సన్‌ను సైతం విమానంలో నుంచి దించేసిన ఘటన ఇటీవల దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేటుచేసుకుంది. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్‌పర్సన్ రష్మీ సలుజా దిల్లీ నుంచి లండన్ వెళ్లాలని నిర్ణయించుకుని ఇటీవల ఎయిరిండియా విమానం ఎక్కారు. అయితే విమానంలోని క్రూ మెంబర్లతో ఆమె దరుసుగా వాదించడంతో తనను దిల్లీ ఎయిర్‌పోర్టులోనే దించేసినట్లు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లండన్ వెళ్లాల్సిన ఏఐ 161 ఫ్లైట్ నుంచి ఓ మహిళా ప్యాసింజర్‌ను దించేశామని ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ పేర్కొన్నారు. కానీ, విమాన సిబ్బంది ప్యాసింజర్ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై రష్మీ సలుజా కూడా స్పందించలేదు.
ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం
అయితే తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలిసింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ఏకంగా 894 మంది ప్యాసింజర్లను ఎయిర్ ఇండియా దించేసింది. వివిధ కారణాల వల్ల రూ.98 లక్షలను కాంపెన్సేషన్ కింద ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment