Religare Enterprises
-
కంపెనీ ఛైర్పర్సన్ను విమానం నుంచి దించేసిన ఎయిరిండియా..?
క్రూ మెంబర్లతో దురుసుగా ప్రవర్తించినందుకు ఓ ప్రముఖ కంపెనీ ఛైర్పర్సన్ను సైతం విమానంలో నుంచి దించేసిన ఘటన ఇటీవల దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేటుచేసుకుంది. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఛైర్పర్సన్ రష్మీ సలుజా దిల్లీ నుంచి లండన్ వెళ్లాలని నిర్ణయించుకుని ఇటీవల ఎయిరిండియా విమానం ఎక్కారు. అయితే విమానంలోని క్రూ మెంబర్లతో ఆమె దరుసుగా వాదించడంతో తనను దిల్లీ ఎయిర్‌పోర్టులోనే దించేసినట్లు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లండన్ వెళ్లాల్సిన ఏఐ 161 ఫ్లైట్ నుంచి ఓ మహిళా ప్యాసింజర్‌ను దించేశామని ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ పేర్కొన్నారు. కానీ, విమాన సిబ్బంది ప్యాసింజర్ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై రష్మీ సలుజా కూడా స్పందించలేదు. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం అయితే తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలిసింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ఏకంగా 894 మంది ప్యాసింజర్లను ఎయిర్ ఇండియా దించేసింది. వివిధ కారణాల వల్ల రూ.98 లక్షలను కాంపెన్సేషన్ కింద ఖర్చు చేసింది. -
రెలిగేర్ ఫిన్వెస్ట్ వన్‌టైమ్ సెటిల్మెంట్
న్యూఢిల్లీ: సొంత అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ 16 రుణదాత సంస్థలతో వన్‌టైమ్ సెటిల్మెంట్ పూర్తిచేసుకున్నట్లు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి తుది చెల్లింపుకింద రూ. 400 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. గడువుకంటే దాదాపు నెల రోజుల ముందుగానే మార్చి 8న సెటిల్మెంట్ను పూర్తి చేసినట్లు తెలియజేసింది. 2022 డిసెంబర్ 30న కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెటిల్మెంట్ పూర్తికావడంతో గత ప్రమోటర్ల అవకతవకల కారణంగా తలెత్తిన లెగసీ సమస్యలకు ముగింపు పలికినట్లు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్శన్ రష్మి సలుజ పేర్కొన్నారు. కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో 2018 జనవరి నుంచి రెలిగేర్ ఫిన్వెస్ట్ రూ. 9,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు ప్రస్తావించారు. కాగా.. తాజా సెటిల్మెంట్ పూర్తి నేపథ్యంలో తిరిగి ఎంఎస్ఎంఈలకు రుణాలందించడం తదితర బిజినెస్‌లను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. -
కొత్త ఏడాదిలో..కొత్త ఉత్సాహంతో..మళ్లీ రెలిగేర్ ఫిన్వెస్ట్ షురూ!
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశమున్నట్లు రుణ సంక్షోభంలో చిక్కుకున్న రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎఫ్ఎల్) భావిస్తోంది. రూ. 2,300 కోట్ల వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) ప్రతిపాదనకు రుణదాతలలో అత్యధిక శాతం సానుకూలంగా స్పందించడం ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడుతోంది. ఓటీఎస్ ప్రక్రియ పూర్తయితే ఆర్ఎఫ్ఎల్ దిద్దుబాటు చర్యల ప్రణాళిక(సీఏపీ) నుంచి బయటపడే వీలుంది. కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో ఆర్బీఐ 2018 జనవరిలో సీఏపీకి తెరతీసిన సంగతి తెలిసిందే. ఓటీఎస్ ఒప్పందంపై 16 రుణదాత సంస్థలలో 14 సంస్థలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోగా మిగిలిన రెండు సంస్థలు సైతం అంగీకరించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఎన్బీఎఫ్సీ ఆర్ఎఫ్ఎల్.. ఎస్బీఐ అధ్యక్షతన ఏర్పాటైన రుణదాతల కన్సార్షియంకు రూ. 5,300 కోట్లు బకాయి పడింది. ప్రతిపాదిత ఓటీఎస్ ప్రకారం 2022 జూన్‌లో కంపెనీ సెక్యూరిటీగా రూ. 220 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ బాటలో ఓటీఎస్ సొమ్ము చెల్లించేందుకు కంపెనీ సంసిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి 2023లో కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. -
ఎన్సీడీ హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్వెస్ట్ డిఫాల్ట్
న్యూఢిల్లీ: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్(ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుపై రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎఫ్ఎల్) విఫలమైంది. రెలిగేర్ ఎంటర్ర్పైజెస్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రుణభారంలో ఉన్న తన అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ఎల్) మార్చి 28న నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులో డిఫాల్ట్ అయిందని తెలిపింది. ఈ విలువ దాదాపు రూ.2.41 కోట్లని ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. సంస్థ డిఫాల్ట్ వరుసగా ఇది రెండవనెల. తనకు రావాల్సిన-చెల్లించాల్సిన రుణాల్లో అసమతుల్యత కారణంగా బాండ్ హోల్డర్లకు ఫిబ్రవరి 25న చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులో(రూ. 96 లక్షల వడ్డీ చెల్లింపుల్లో) ఆర్ఎఫ్ఎల్ గత నెల్లో డిఫాల్ట్ అయ్యింది. డిఫాల్ట్ ఎందుకంటే... ఈ మేరకు వెలువడిన ప్రకటన ప్రకారం, ఆర్ఎఫ్ఎల్ రుణదాతలు సూచించినట్లుగా, సంస్థ అన్ని చెల్లింపులకు రుణదాతలు నియమించిన ఏఎస్ఎం (ఏజెన్సీస్ ఫర్ స్పెషలైజ్డ్ మానిటరింగ్) నుండి ముందస్తు ధృవీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం, ఆర్ఎఫ్ఎల్ 2022 మార్చి 28న చెల్లించాల్సిన అర్హత కలిగిన డిబెంచర్ హోల్డర్లకు ‘ఎన్సీడీల సిరీస్-36 వడ్డీ చెల్లింపు సర్టిఫికేట్ కోసం’ ఏఎస్ఎంను ఆర్ఎఫ్ఎల్ అభ్యర్థించింది. అయితే ఇందుకు ఏఎస్ఎం ఆమోదం లభించలేదు. ఈ కారణంగా, అర్హత కలిగిన హోల్డర్లకు ఎన్సీడీ వడ్డీ మొత్తాన్ని ఆర్ఎఫ్సీ చెల్లించలేకపోతోంది. ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో... ఆర్ఎఫ్ఎల్ బలహీన ఆర్థిక స్థితి కారణంగా జనవరి 2018 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రంలో (సీఏపీ) ఉంది. తాజా వ్యాపారాన్ని చేపట్టకుండా ఆంక్షలు ఉన్నాయి. రెలిగేర్ ఎంటర్ర్పైజెస్ ప్రమోటర్‌గా కొనసాగుతున్న ఆర్ఎఫ్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను మార్చి 11న ఆర్బీఐ తిరస్కరించింది. రుణభారంలో ఉన్న ఆర్ఎఫ్ఎల్పై ‘‘మోసపూరిత’’ ఆరోపణలు ఉండడమే దీనికి కారణం. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ, ఆర్ఎఫ్ఎల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకుంది. మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, అతని సోదరుడు మల్విందర్ సింగ్ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల కారణంగా కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాదాపు రూ. 4,000 కోట్ల ఆర్థిక అవకతవకలపై పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. (చదవండి: అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఏడుగురు భారతీయులు!) -
రెలిగేర్‌లో 11 అనుబంధ సంస్థల విలీనం
న్యూఢిల్లీ: రెలిగేర్ ఎంటర్ప్రైజెస్.. తన 11 పూర్తి స్థాయి అనుబంధ కంపెనీలను విలీనం చేసుకోనున్నది. ఈ మేరకు మంగళవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయం తీసుకుంది. కంపెనీ కార్పొరేట్ వ్యవస్థీకరణను సరళీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. విలీనం కానున్న ఆ 11 కంపెనీలు... రెలిగేర్ సెక్యూరిటీస్(బ్రోకింగ్ బిజి నెస్ మినహాయింపు), రెలిగేర్ కమోడిటీ బ్రోకింగ్, ఆర్జీఏఎమ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రెలిగేర్ వెంచర్ క్యాపిటల్, రెలిగేర్ ఆర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, రెలిగేర్ క్యాపిటల్ ఫైనాన్స్, ఆర్జీఏఎమ్ క్యాపిటల్ ఇండియా, రెలిగేర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రెలిగేర్ సపోర్ట్ సర్వీసెస్, రెలిగేర్ ఆర్ట్స్ ఇనీషియేటివ్, రెలిగేర్ క్యాపిటల్ మార్కెట్స్(ఇండియా) .. ఈ విలీన వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ షేర్ 4.3 శాతం వృద్ధితో రూ.249 వద్ద ముగిసింది.