న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరో ఇరకాటంలో పడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రీమియం ప్యాసెంజర్ల ఎయిరిండియా లాంజ్ ఆహార ప్లేటులో బొద్దింక దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని ప్యాసెజంర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు. ''డియర్ ఎయిరిండియా.. ఫస్ట్ క్లాస్ ప్యాసెంజర్లు, బిజినెస్‌ల కోసం వాడే మీ ఢిల్లీ వీఐపీ లాంజ్‌కు సర్వ్ చేసిన ఫుడ్‌లో బొద్దింక వచ్చింది. ఇది చాలా అసహ్యకరం'' అంటూ హరీందర్ బవేజ ట్వీట్ చేశారు. బొద్దింక వచ్చిన తన ప్లేటును కూడా ఈ ట్వీట్‌కు పోస్టు చేశారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన ఎయిరిండియా తన మైక్రోబ్లాగింగ్ సైట్‌లో క్షమాపణ చెప్పింది.
సరియైన చర్యలు తీసుకోవాలని వెంటనే కేటరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్‌ను ఆదేశించింది. ''ఇది విన్నందుకు చాలా బాధగా ఉంది. మిస్ హరీందర్... టర్మినల్ 3 వద్ద ఉన్న ఏజెన్సీ మేనేజింగ్ లాంజ్‌ను మేము అలర్ట్ చేశాం. వెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ సంఘటనపై మేము చాలా చింతిస్తున్నాం. క్షమించండి'' అంటూ పలు ట్వీట్లను చేసింది. ఈ లాంజ్‌లో కేటరింగ్ సర్వీసులు అందించే సంస్థ ఎయిరిండియా సబ్సిడరీ హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
Dear @airindiain cockroaches on food plates at your Delhi Lounge for biz and first class passengers. Disgusting pic.twitter.com/LEy9GtrgTY
— Harinder Baweja (@shammybaweja) December 20, 2017
Comments
Please login to add a commentAdd a comment