
సీఎం యోగికి ఉత్తరం రాసిన మహిళ
కాన్పూర్: ఇదివరకే పెళ్లి అయిన విషయం దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్న భర్తను నిలదీసినందుకు విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పాడని, ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఓ ముస్లిం మహిళ ఉత్తరం రాసింది. ఈ విషయంపై గవర్నర్ రాంనాయక్‌కు, తన భర్త పనిచేసే కార్మిక శాఖకు సంబంధించిన అధికారులకు కూడా ఉత్తరం రాసింది.
కొంతకాలంగా ఆమె ఇక్కడ ఓ కంప్యూటర్ కేంద్రాన్ని నడుపుతోంది. గత ఏడాది నవంబర్ 23న తనకు వివాహమైందని, ఆ సమయంలో రూ.25 లక్షల విలువ చేసే కారు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను కట్నకానుకలుగా ఇచ్చినట్లు చెప్పింది. తన భర్తకు ఇదివరకే పెళ్లి అయిన విషయం తెలుసుకొని ఆయనను నిలదీయడంతో తనపై అత్తింటివారు దాడి చేశారని తెలిపింది.