‘సీఎం యోగికి భయపడను’ | Not scared of Yogi Adityanath, I stand by my words: Salman Nizami | Sakshi

‘సీఎం యోగికి భయపడను’

Published Tue, Mar 28 2017 4:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

‘సీఎం యోగికి భయపడను’

‘సీఎం యోగికి భయపడను’

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే తనకు భయం లేదని కశ్మీర్ కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్ నేత సల్మాన్ నిజామీ అన్నారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే తనకు భయం లేదని, ఆయనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కశ్మీర్ కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్ నేత సల్మాన్ నిజామీ అన్నారు. సీఎం యోగిపై ట్విటర్ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ అభిషేక్ ఆత్రే పరువునష్టం దావా నోటీసు పంపారు.

దీనిపై సల్మాన్ నిజామీ స్పందిస్తూ... ‘నేను భయపడను. సీఎం యోగిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. మా లాయర్ ద్వారా నోటీసుకు సమాధానం ఇస్తాను. ఎవరో చెప్పినదాన్ని నేను చెప్పను. నేను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ప్రకటిస్తాను. ముఖ్యమంత్రి పదవికి యోగి తగరని బలంగా విశ్వసిస్తున్నాను. యూపీలో ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని, కమలం పార్టీ ఆయనను బలవంతంగా ప్రజలపై రద్దుతోంద’ని పేర్కొన్నారు. మతోన్మాదులు, విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వ్యతిరేకించే హక్కు రాజ్యాంగం అందరికీ ఇచ్చిందని అన్నారు.

ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై సాక్ష్యాలు లేనప్పటికీ ఆయనను వేటాడుతున్నారని.. హత్య, దాడుల కేసులు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ను యూపీ సీఎం చేశారని ట్విటర్ లో సల్మాన్ నిజామీ పోస్ట్ చేయడంతో వివాదం రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement