బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ‘తేజస్’ మొరాదాబాద్‌లో శుక్రవారం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అనంతరం ఈ ‘క్వీన్’ స్టార్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలో సీఎం అధికారిక నివాసంలో గౌరవ పూర్వకంగా కలిసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫైర్ బ్రాండ్ ఆయనకు థ్యాంక్స్ చెప్పింది.
సీఎం యోగిని కలిసిన కంగనా వారిద్దరి సమావేశానికి సంబంధించిన వరుస ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాబోయే యూపీ ఎన్నికల్లో ఆయనే గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ సమయంలో ఆయన రామ మందిర భూమి పూజలో ఉపయోగించిన రామ దర్బార్ నాణెం బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఇదిలాఉండగా.. యూపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 75 జిల్లాల్లో స్పెసిఫిక్ సంప్రదాయ పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు కోసం ఉద్దేశించిన ‘వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ)’కి కంగనాని అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటికి ఓడీఓపీ ప్రోడక్ట్‌ని సీఎం అందజేశారు.
ప్రస్తుతం కంగనా, సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ‘తేజస్’లో ఐఏఎఫ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. 'ఢాకాడ్', 'మణికర్ణిక రిటర్న్స్' మరియు 'సీత: ది ఇన్‌కార్నేషన్' సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
చదవండి: థియేటర్లను పూర్తిగా మూసేయ్యాలి అనుకుంటున్నారా..?
Comments
Please login to add a commentAdd a comment