
సీఎం, డిప్యూటీ సీఎం.. ఇద్దరూ ఎంపీలే
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఎంపికలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. 403 సీట్లున్న యూపీలో బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచినా వీరిలో ఒక్కరికీ సీఎం, డిప్యూటీ సీఎం పదవులు దక్కలేదు.
యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ ఎంపీ కాగా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య.. పూల్‌పూర్ ఎంపీ. మరో డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ.. లక్నో మేయర్. దీంతో వీరు ముగ్గురూ ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావాల్సివుంది.
యూపీ సీఎం రేసులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, యూపీ బీజేపీ చీఫ్ కేశవ ప్రసాద్ మౌర్య పేర్లు ప్రముఖంగా వినిపించినా చివర్లో హిందుత్వ ఐకాన్ యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నుకున్నారు. సీఎంగా యోగి, డిప్యూటీ సీఎంలుగా కేశవ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మతో పాటు మరో 43 మంది మంత్రులు ప్రమాణం చేశారు.