మోదీ, యోగిలకు ఉగ్ర ముప్పు!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కశ్మీరీ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిం చాయి. కశ్మీర్ లోయలోకి చొరబడిన ఈ ఉగ్రవాదులు చిన్న చిన్న బృందాలుగా రైల్లో ఉత్తరప్రదేశ్ చేరుకోవడానికి యత్నించే అవకాశముందన్నాయి. ఈ వివరాలను ప్రధాని భద్రత బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)కు, యోగి భద్రతా అధికారులకు అందించారు.
కాగా, మోదీ, యోగి భద్రతకు తీవ్ర ముప్పు ఉందని ముంబై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తెలిపింది. వీరిద్దరిపై దాడుల గురించి మాట్లాడుకుంటుండగా రాయ్‌గఢ్‌లో కొందరు విన్నారని, దాడుల కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంది. మోదీపై దాడి చేయడానికి తాను, మరో మిలిటెంట్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఉకాషా అనే లష్కరే ఉగ్రవాది ఓ వ్యక్తితో జరిపిన సంభాషణలో చెప్పినట్లు గతేడాది నిఘా అధికారులు గుర్తించారు.
పంచాయతీలది కీలక పాత్ర
భారత గ్రామీణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పంచాయతీలు శక్తిమంత మైన మార్గాలని, దేశ పరివర్తనలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ట్వీట్ చేశారు. పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు.