ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని జ్ఞానవాపిని సందర్శించుకున్నారు. అక్కడి నేలమాళిగలోని విగ్రహాలను వీక్షించారు. దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని అక్కడ కొలువైన దేవతలను వేడుకున్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం వారణాసికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య వారణాసిలో పర్యటించనున్నారు. పూర్వాంచల్ అభివృద్ధికి దోహదపడే అమూల్ ప్లాంట్‌కు ప్రధాని మోదీ గతంలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దీనిని ఫిబ్రవరి 23న ఆయన ప్రారంభించనున్నారు. వారణాసిలోని కార్ఖియాగావ్‌లో జరిగే భారీ బహిరంగ సభతో ప్రధాని మోదీ ఎన్నికల సైరన్ మోగించనున్నారు.
ఈ సభకు లక్ష మందికి పైగా జనం తరలివస్తారని అంచనా. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహాలను పరిశీలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశ్వనాథ ఆలయంలో బాబా భోలేనాథ్‌ను దర్శించుకున్నారు. అలాగే జ్ఞానవాపి నేలమాళిగలో విగ్రహాలను వీక్షించారు. ఈ సమయంలో ఆయన వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని నేలమాళిగను పూజల కోసం తెరిచారు. అప్పటి నుంచి సామాన్య భక్తుల దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment