యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు(సోమవారం) వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాటికి ఐదు కోట్లకు పైగా భక్తులు స్నానాలు ఆచరిస్తారని కుంభమేళా నిర్వాహకులు అంచనా వేశారు. జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వసంత పంచమి అమృత స్నానాల సందర్బంగా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘వార్ రూమ్’లో కూర్చుని, కుంభమేళా పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: A woman devotee blows the conch shell at Sangam Ghat as saints and devotees gather for Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/vXlIqmiVun
— ANI (@ANI) February 3, 2025
ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానానికి సిద్ధమైన సాధువులు, భక్తుల మధ్య సంగమ్ ఘాట్ వద్ద శంఖం పూరిస్తున్న ఒక మహిళా భక్తురాలు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Foreign devotees sing 'Hanuman Chalisa' as they head to Triveni Sangam for the 'Amrit Snan' on the occasion of Basant Panchami. pic.twitter.com/Fnmw9AhYP8
— ANI (@ANI) February 3, 2025
ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమం వైపు వెళుతున్న విదేశీ భక్తులు 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ కనిపించారు.
స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ ‘13 అఖాడాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్నారు. మేము గంగా మాతను, శివుడిని పూజించాం. నాగ సాధువులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది మా మూడవ 'అమృత స్నానం', నేను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాను. 13 అఖాడాలకు అవసరమైన ఏర్పాట్లు చేసినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అభినందనలు’ అని అన్నారు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Spiritual leader Swami Kailashanand Giri says, "All the 13 Akhadas took a holy dip at Triveni Sangam...We offered prayers to Ganga Maa, Lord Shiva...All the Nagas are very excited...This was our third 'Amrit Snan'...I congratulate UP… pic.twitter.com/po5OtrAArf
— ANI (@ANI) February 3, 2025
ప్రయాగ్‌రాజ్‌లోని ఒక నాగ సాధువు మాట్లాడుతూ ‘గత రెండు అమృత స్నానాల కంటే ఈరోజు ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు స్నానం మాకెంతో ముఖ్యమైనది’ అని అన్నారు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A Naga sadhu says, "Arrangements today were better than the previous two Amrit Snans... Today's snan was the biggest for us saints..." pic.twitter.com/n1OPYfYw34
— ANI (@ANI) February 3, 2025
ప్రయాగ్‌రాజ్‌లోని ఒక సాధువు మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు అమృత స్నానం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అఖాడాలు, సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి’ అని అన్నారు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A saint says, "... The Amrit Snan was very good today... All akharas and saints took a holy dip. The arrangements were very nice." pic.twitter.com/Ebqvcv8oTG
— ANI (@ANI) February 3, 2025
ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఒక విదేశీ భక్తుడు మాట్లాడుతూ ‘ఇది మాటల్లో చెప్పలేని మధుర అనుభవం. నేను చాలా ధన్యుడినయ్యానని భావిస్తున్నాను’ అని అన్నారు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl
— ANI (@ANI) February 3, 2025
ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘ఈ పవిత్రమైన రోజున అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అఖాడాలు ఎల్లప్పుడూ ఐక్యంగానే ఉంటారు’ అని అన్నారు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl
— ANI (@ANI) February 3, 2025
జునా అఖారా స్నానం పూర్తయింది. మొదట మహానిర్వాణి, తరువాత శ్రీ నిరంజని, అనంతరం జునా అఖారా స్నానం చేశారు. జూనా అఖారాకు చెందిన నాగ సాధువులు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశారు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Acharya Laxminarayan Tripathi of Kinnar Akhara says, "... We are all very happy on this auspicious day. The Kinnar Akhara was, is, and will always be united." pic.twitter.com/z867gPFecp
— ANI (@ANI) February 3, 2025
ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Naga sadhus of the Juna Akhara take a holy dip as part of the Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/1WsR4Elltj
— ANI (@ANI) February 3, 2025
Comments
Please login to add a commentAdd a comment