
గువహటి: కరోనా మహమ్మారి విజృంభించడంతో లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. దీంతో వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఏర్పడింది. ఉన్నచోట పనిలేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత ఊర్లకు వెళ్లడానికి వీలు లేక విలవిలలాడిపోతున్నారు. కొంత మంది కార్మికులు ఒంటరిగా, మరికొంత మంది కుటుంబాలతో కలిసి సొంత ఊర్లకి పయనమవుతున్నారు. బస్సులు, రైళ్లు లేక వేల కిలోమీటర్లు ప్రాణాలు పణంగా పెట్టి కాలినడకన సొంత గూటికి చేరుతున్నారు. వీరిలో కొంత మంది మార్గం మధ్యలోనే ప్రాణాలు విడుస్తుంటే ఇంకొందరూ కష్టపడి తమ వారిని కలుసుకుంటున్నారు. (సొంతూరికి.. కాలినడకన)
అస్సాంకి చెందిన వలస కార్మికుడు జాదవ్ గొగొయ్ 2900 కిలో మీటర్లు కొంత దూరం కాలినడకన, కొంత దూరం ట్రక్ మీద పగలు రాత్రి తేడా లేకుండా పోరాటం చేసి అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఉన్న తన సొంత ఊరికి చేరుకున్నారు. గొగొయ్‌ని ప్రస్తుతం జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఉన్న క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడి నుంచే ఆయన వీడియో కాల్ ద్వారా ఇన్ని రోజులు తన ప్రయాణాన్ని వివరించారు. భారత ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సమయానికి తాను గుజరాత్‌లో పని చేస్తున్నానని, లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయానని తెలిపారు. అక్కడ తిండిలేదు, డబ్బులు లేక పరిస్థితి చాలా దయనీయంగా మారిందని తెలిపాడు. దీంతో చేసేది అక్కడ ఉన్న కొంత మందితో కలిసి కాలినడకనే సొంత ఊరికి పయనమయ్యానని తెలిపారు. తన స్నేహితులు వారణాసి వరకు కలిసి వచ్చారని తరువాత తాను ఒక్కడినే వచ్చానని తెలిపారు. మార్గ మధ్యలో ఎక్కడ బస్సు స్టాప్‌లు ఉంటే అక్కడ పడుకుంటూ ఎవరైనా ఆహారాన్ని అందిస్తే అది తింటూ రాత్రనక పగలనక తన యాత్రను కొనసాగించానని తెలిపారు. చివరికి తన ఊరికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంకా ఎప్పుడు అస్సాం నుంచి కాలు బయట పెట్టను అని తెలిపారు. (వలస కూలీలు రాష్ట్రం దాటరాదు)
ఇక విషయం గురించి నాగోన్ జిల్లా కలెక్టర్ జాదవ్ సైకియా మాట్లాడుతూ గొగొయ్ ఏ మార్గంలో వచ్చాడో పూర్తి వివరాలు కనుగొంటామని, అన్ని కిలోమీటర్లు కాలినడకన రావడం సాధ్యం కాదన్నారు. అతను ఎలా ఇంత దూరం వచ్చారో తెలుసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment