కువైటు నుండి వచ్చిన ఎన్. లక్ష్మిదేవిమృతి చెందిన కొట్టూరు నరసమ్మ(ఫైల్)
అట్లూరు: అధికారపార్టీ నాయకుల కబ్జాలు, కుంభకోణాలు, తదితర ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోవడం ఒక ఎత్తయితే.. వారి అండదండలతో మేమేం తక్కువ అంటూ చనిపోయినవారి, కువైటుకు వెళ్లినవారిపేర్లమీద వృద్ధాప్య, వితంతు పింఛన్లు లక్షల రూపాయల్లో పంచాయితీ కార్యదర్శులు స్వాహా చేసిన ఉదంతం అట్లూరు మండలంలో చోటుచేçసుకుంది. ఈవిషయం సామాజిక తనికీ బృంధం వెల్లడించినప్పటికీ తమ పలుకు బడిని ఉపయోగించుకుని బయటికి పొక్కకుండా చేతివాటం ప్రదర్శించారు. మండల పరిదిలోని తంభళ్లగొంది, కుంభగిరి, కొం డూరు, మాడపూరు పంచాయితీలలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తంభళ్లగొంది పంచాయతీ పరిధిలోని యర్రబల్లి గ్రామానికి చెందిన కె, వెంకటమ్మ ఐడీ నెంబరు 111450179తో వృద్ధాప్య పించన్ ప్రతినెలా రూ.1000 తీసుకుంటూ ఉండేది. ఆమె 24–3–2015 లో మృతి చెందింది.
ఆమె బ్రతికి ఉన్నట్లు ప్రతి నెలా తన వేలిగుర్తుతో పంచాయతీ కార్యదర్శి రూ,27వేలు స్వాహా చేశాడు. ఎరుకుల కాలనీకి చెందిన నామాల లక్ష్మిదేవి కి భర్త చనిపోవడంతో ఐడీ నెంబరు 111545324తో వితంతు పింఛన్ ప్రతి నెలా రూ.100 తీసుకుంటూ ఉండేది. 2014లో జీవనోపాధికోసం కువైట్ వెళ్లింది. అప్పటినుండీ ప్రతినెలా ఆమె పేరున సంబంధిత పంచాయతీ కార్యదర్శి స్వాహా చేయడం జరగింది. ఈమె కువైటు నుంచి ఈనెల 15వ తేదీన వచ్చింది. పింఛన్ గురించి అడగగా నాకు తెలియదు అన్నారు. యర్రబల్లి ఎస్సీకాలనీకి చెందిన కొట్టూరు నరసమ్మ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది. ఈమె పేరున ప్రతినెలా రూ.1000 చొప్పున ఇంతవరకు రూ,29వేలు స్వాహాచేయడం జరిగింది. అలాగే మాడపూరు పంచాయితీ పరిదిలో ఎం. లక్షుమ్మ, సుబ్బమ్మ, గురమ్మ, చిన్నక్క వీరు గ్రామంలో లేనప్పటికీ వారి పేర్ల మీద సంబందిత పంచాయతీ కార్యదర్శి రూ,18వేలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ చేస్తాం: సుమారు మూడు లక్షల రూపాయలకు పైగా చనిపోయిన వారిపేర్ల మీద, కువైటుకు వెళ్లిన వారిపేర్లపై పింఛన్ సొమ్ము స్వాహా చేసిన ఉధంతంపై సాక్షి ఎంపీడీఓ రెడ్డెయ్యనాయుడును వివరణ అడుగగా విచారించి చర్యలు తీసుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment