భువనేశ్వర్: క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందన్న భయంతో వలస కార్మికులు రైలులో నుంచి దూకేశారు. అయినప్పటికీ వారు క్వారంటైన్ నుంచి తప్పించుకోలేని ఘటన ఆదివారం రాత్రి ఒడిశాలోని మజికాలో చోటు చేసుకుంది. వివరాలు.. గుజరాత్‌లోని ప్రధాన హాట్‌స్పాట్ కేంద్రం అయిన అహ్మదాబాద్ నుంచి వలస కూలీలు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా ఒడిశాలోని స్వస్థలానికి పయనమయ్యారు. రైలు గమ్యానికి చేరుకునేందుకు నిదానించగా 20 మంది కూలీలు వెంటనే బోగీల్లో నుంచి బయటకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. గమనించిన అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఏడుగురు మాత్రమే దొరికారు. (దేశంలోనే అతి పెద్ద సంక్షోభం)
వీరిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై అంగుల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జగ్మోహన్ మీనా మాట్లాడుతూ.. కూలీలు 28 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందన్న భయంతో దూకేశారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం వాళ్లందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. కాగా ఒడిశాకు చేరుకునే వలస కార్మికులకు 28 రోజుల క్వారంటైన్ తప్పనిసరని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు గంజాంలోని క్వారంటైన్ కేంద్రంలో ఆహార నాణ్యతతోపాటు వసతి సౌకర్యం కూడా సరిగా లేవన్న కారణంతో 150 మంది కూలీలు అక్కడి నుంచి పారిపోయారు. (కరోనా: నటుడు ప్రియదర్శి హోమ్ క్వారంటైన్!)
Comments
Please login to add a commentAdd a comment