ఇమిగ్రేషన్‌పై కొరడా
ఇప్పటికే ఒబామాకేర్‌ను రద్దుచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వలసవాదులపై కఠినంగా వ్యవహరించటం, మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టడంపై ఈ వారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వలస విధానంలో ముస్లిం దేశాల నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయటంపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇరాక్, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ వంటి దేశాలనుంచి వలసలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయటమా లేక.. శాశ్వతంగా నిరోధించటమా అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.