thwart
-
ఇమిగ్రేషన్పై కొరడా
ఇప్పటికే ఒబామాకేర్ను రద్దుచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వలసవాదులపై కఠినంగా వ్యవహరించటం, మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టడంపై ఈ వారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వలస విధానంలో ముస్లిం దేశాల నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయటంపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇరాక్, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ వంటి దేశాలనుంచి వలసలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయటమా లేక.. శాశ్వతంగా నిరోధించటమా అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. -
భారీ ఉగ్రవాద కుట్ర భగ్నం
మాస్కో: ఉగ్రవాదులు రష్యా రాజధాని మాస్కోలో సృష్టించతలపెట్టిన పేలుడు కుట్రను రష్యా పోలీసులు భగ్నం చేశారు. ముందుగానే స్పందించి భారీ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా దాన్ని నిర్వీర్యం చేశారు. వెంటనే వేగంగా స్పందించి చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టి కొందరు అనుమానితులను కూడా అరెస్టు చేశాయి. ఈ విషయాన్ని రష్యా నేషనల్ యాంటీ టెర్రరిస్ట్ కమిటీనే స్పష్టం చేసింది. మాస్కోలోని స్ట్రెల్ బిష్ చెంకీ పెరెలాక్ నివాస సముదాయ ప్రాంతాల్లో తొలుత బాంబును గుర్తించారు. అనంతరం అక్కడే ఉన్న ఇళ్లలో గాలింపులు చేపట్టి కొందరు అనుమానితులను అరెస్టు చేశారు. ప్రాథమిక వివరాల ప్రకారం పోలీసులు స్వాధీనం చేసుకున్న బాంబు 4కేజీలు ఉంది. ఈ బాంబును గుర్తించిన వెంటనే ముందస్తు జాగ్రత్తగా 120 కుటుంబాలను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలో పేలుడు చోటు చేసుకోకుండా గ్యాస్ పంపిణీని కూడా నిలిపివేశారు. అనంతరం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఇటీవల ఉగ్రవాదులను అణిచి వేసే చర్యలకు రష్యా తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.