
ట్రంప్ మళ్లీ వేట మొదలెట్టాడు
ట్రావెలింగ్ వీసా విషయంలో ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించి ఇప్పటికే వలస వాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం నుంచి పోలీసులను పరుగులు పెట్టించినట్లు తెలిసింది.
న్యూయార్క్: ట్రావెలింగ్ వీసా విషయంలో ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించి ఇప్పటికే వలస వాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం నుంచి పోలీసులను పరుగులు పెట్టించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు వందలమంది వలసదారులను, శరణార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట.
ఎలాంటి ధృవపత్రాలు లేని వారందరిని అదుపులోకి తీసుకొని చిన్నచిన్నలోపాలున్నా వారిని పోలీసు స్టేషన్లకు తరలించి విచారణలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అట్లాంటా, ఆస్టిన్, చికాగో, లాస్ ఎంజెల్స్, న్యూయార్క్, ఇతర నగరాల్లో పోలీసులు పెద్ద మొత్తంలో దాడులు నిర్వహించి డాక్యుమెంట్స్ లేనివాళ్లను అదుపులోకి తీసుకున్నారని ది ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక మైగ్రాంట్స్‌పై తొలి రైడింగ్స్ ఇవే కావడం విశేషం.