వలసదారుల పడవ బోల్తా: 11 మంది దుర్మరణం | 11 Dead As Ship Carrying Migrants Sinks Off Greece | Sakshi
Sakshi News home page

వలసదారుల పడవ బోల్తా: 11 మంది దుర్మరణం

Published Fri, Dec 24 2021 8:06 PM | Last Updated on Fri, Dec 24 2021 8:52 PM

11 Dead As Ship Carrying Migrants Sinks Off Greece  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Ship Carrying Migrants Sinks Off Greece Coast: వలసదారులతో వెళుతున్న పడవ గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకు ఉత్తరాన ఉన్న ద్వీపంలో మునిగిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో సుమారు 11 మంది దుర్మరణం చెందారని కోస్ట్ గార్డ్  అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదంలో చిక్కుకున్న దాదాపు 90 మందిని రక్షించినట్లు వెల్లడించారు.

(చదవండి: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప!!)

అయితే అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ మేరకు పడవ మునిగిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు.  అయితే ప్రజలు తమ మనుగడను వెతుక్కుంటూ ప్రమాదకరమైన ప్రయాణాలను కొనసాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్‌ (యూఎస్‌హెచ్‌సీఆర్‌) ప్రతినిధి అసిస్టెంట్ అడ్రియానో ​​సిల్వెస్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు.

(చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement