లక్నో: లాక్‌డౌన్ వల్ల జీవితాలు రోడ్డున పడ్డ వలస కార్మికులపై ఉత్తర ప్రదేశ్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని దొంగలుగా అభిర్ణిస్తూ కించపరిచడం వివాదాస్పదంగా మారింది. శనివారం యూపీ మంత్రి ఉదయ్ భాన్ సింగ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది వలస కార్మికులు ఇంటి బాట పట్టారన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వాలు ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా కొందరు దొంగలు, బందిపోట్లులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మార్చి 25న నరేంద్రమోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం వలస కూలీల సమస్యలపై దృష్టి సారించిందని తెలిపారు. (నీరింకిన కళ్లు..!)
ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌లో పలు చోట ఆహార స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఆహార సదుపాయంతో పాటు అత్యవసర సరుకులను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వీరికోసం ఇంత చేస్తున్నప్పటికీ కొందరు ఏమాత్రం లెక్క చేయకుండా దొంగల్లా పొలాల వెంబడి కాలినడకన పయనిస్తూనే ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా శనివారం ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కార్మికులు మరణించిన కొన్నిగంటలకే మంత్రి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment