
గురువారం వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే చనిపోతున్నారని తెలిపారు. 98 శాతం మంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నారని.. ఇది దేశంలోనే మంచి పరిణామమని మంత్రి పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపుల కారణంగా గ్రామాల్లోకి వలస కార్మికులు, ఇతర వ్యక్తులు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాల్లోని వైద్య సిబ్బందితో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారు లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడు తూ..
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి జ్వరం వంటి పరీక్షలు చేయాలని ఆదేశిం చారు. కరోనాతోపాటు ఇతర వైద్య సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలని సూచిం చారు. వంద శాతం ఇమ్యునైజేషన్ చేయాలన్నారు. సిబ్బంది పనితనానికి నిదర్శనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ పెరగటమేనని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, మలేరియా ఇతరత్రా జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతీ ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే చనిపోతున్నారని తెలిపారు. 98 శాతం మంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నారని.. ఇది దేశంలోనే మంచి పరిణామమని మంత్రి పేర్కొన్నారు.
సిబ్బంది రక్షణ ముఖ్యం..
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లు వేసుకోవాలని మంత్రి ఈటల వైద్య సిబ్బందిని కోరారు. రవాణా సదుపాయాలు లేనిచోట్ల మెడికల్ ఆఫీసర్లకు వాహనాలు ఏర్పాట్లు చేయాలని అ ధికారులను ఆదేశించారు. కరోనాపై యుద్ధం లో మొదటి వరుసలో పనిచేస్తున్న 9 వేల మంది ఆరోగ్య కార్యకర్తల భద్రత మొదటి ప్రాధాన్యమని మంత్రి చెప్పారు. సిబ్బంది రక్షణ ముఖ్యమని, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కరోనాకు అడ్డుకట్ట వేయడానికి పని చేసిన వైద్య సిబ్బందికి సమాజంలో ఎప్పుడూ లేనంత గొప్ప గౌరవం దక్కిందని చెప్పారు. శానిటైజేషన్ వర్కర్ నుంచి మంత్రి వరకు అందరూ కలసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలువురు ఆశ కార్యకర్తలు, ఏఎ న్‌ఎంలతో మంత్రి మాట్లాడారు. వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలానికి చెందిన విజయలక్ష్మి అనే ఆశ కార్యకర్తతో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, సౌకర్యాల పట్ల సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు.