
సింగపూర్: పెరుగుతున్న కేసులను చూసి ప్రజలు ఏమాత్రం భయాందోళనకు గురి కావద్దని సింగపూర్ ప్రభుత్వం ప్రజలను అభ్యర్థించింది. తాజాగా గురువారం మధ్యాహ్నం నాటికి తాజాగా 752 కేసులు నమోదవగా మొత్తం బాధితుల సంఖ్య 26,098కు చేరింది. అయితే నానాటికీ కేసులు పెరిగిపోతున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులపై దృష్టి సారించింది. ఇప్పటికే సెలూన్లు, కేక్, డిజర్ట్ షాపులు, లాండ్రీ సర్వీసులు, సంప్రదాయ చైనీస్ మెడిసిన్ హాళ్లు, గృహ ఆధారిత ఆహార వ్యాపారాలు తదితర కార్యకలాపాలు, వ్యాపారాలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. (మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు)
తాజాగా కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్న విదేశీ కార్మికులు(వలస కార్మికులు)కు విధించిన ఆంక్షలపై సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడైన తర్వాతే పనిలోకి చేరేందుకు అనుమతిస్తామంది. కాగా విదేశీ కార్మికుల వల్లే అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. సింగపూర్ మంత్రి జోసఫిన్ టియో మాట్లాడుతూ.. తమ దేశంలో విదేశీ కార్మికులందరికీ విస్తృతంగా కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇలా వలస కార్మికులకు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నదేశాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. ఈ క్రమంలో వారిపై విధించిన ఆంక్షలను జూన్ నుంచి క్రమంగా ఎత్తివేస్తామని వెల్లడించారు. (అప్పటివరకు లాక్‌డౌన్ నీడలో సింగపూర్)
Comments
Please login to add a commentAdd a comment