బ్రెజిల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 57కి చేరింది. స్థానిక అధికారులు మీడియాకు పలు వివరాల తెలిపారు.
ఉరుగ్వే, అర్జెంటీనా సరిహద్దుల్లోని రియో గ్రాండే దో సుల్‌లో భారీ వర్షాల కారణంగా 67 మంది గల్లంతైనట్లు పేర్కొన్నారు. 32 వేల మందికి పైగా జనం నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని 497 నగరాల్లో మూడింట రెండొంతుల మందిపై తుఫాను ప్రభావం పడింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక జలవిద్యుత్ ప్లాంట్‌లోని ఆనకట్ట పాక్షికంగా దెబ్బతింది. బెంటో గోన్సాల్వ్స్ పట్టణంలోని ఆనకట్ట కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
పోర్టో అలెగ్రేలోని గైబా సరస్సులో నీరు పెరిగింది. వీధులను వరద నీరు ముంచెత్తింది. పోర్టో అలెగ్రే అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిరవధికంగా నిలిపివేసింది. రాగల 36 గంటల్లో రియో గ్రాండే దో సుల్ ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment