హైదరాబాద్: ఒకవేళ ఎవరైనా మిస్ అయితే..పోలీసులు ఎలా కనుక్కుంటారని 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గూగుల్‌లో సెర్చ్ చేశాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీఫుటేజీల ఆధారంగా పోలీసులు ట్రేస్ చేసి పట్టుకుంటారని గూగుల్ నుంచి సమాధానం దొరికింది. అంతే..సెల్‌ఫోన్‌ను ఇంట్లో పడేశాడు..సీసీ కెమెరాలకు దొరక్కుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుని..చాకచక్యంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
పోలీసులు, కుటుంబ సభ్యులు తనను ఎప్పటికీ కనుక్కోకూడదన్న ఆలోచనతో వెళ్లిపోయిన ఆ విద్యార్థి ఆచూకీ కనుగొనాలంటూ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ కమలాపురికాలనీ ఫేజ్–2కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శైలేష్ కొనోడియా కుమారుడు జయేష్ కొనోడియా (17) ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాడు.
గత నెల 17వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అయితే వెళ్లే సమయంలో సెల్‌ఫోన్‌ను ఇంట్లో వదిలేశాడు. కుటుంబ సభ్యులు సెల్‌ఫోన్‌ను చెక్ చేయగా మిస్ అయితే పోలీసులు ఎలా ట్రేస్ చేస్తారనే విషయాలను గూగుల్ ద్వారా తెలుసుకున్నట్లు గుర్తించారు. ఆ మేరకే సెల్‌ఫోన్‌ను ఇంట్లో వదిలేసి, సీసీ కెమెరాలకు చిక్కకుండా వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. శైలేష్ సోదరుడు నీలేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment