
అఖిల, త్రిష (ఫైల్)
సుభాష్‌నగర్: ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం రాజీవ్‌గృహకల్పకు చెందిన వెంకటరావు కుమార్తె అఖిల(17), సూరారం సాయిబాబానగర్‌కు చెందిన చంద్రమోహన్ కుమార్తె త్రిష (17)లు బహదూర్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
బంధవులైన ఇద్దరు యువతులు రోజు మాదిరిగానే శనివారం కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సూరారం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment