
పైలట్ సహా అందులోని పది మందీ మృతి
అలాస్కా: అమెరికాలోని అలాస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. పైలట్ సహా అందులోని మొత్తం పది మందీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఉనలక్లీట్ నుంచి టేకాఫ్ తీసుకున్న సింగిల్ ఇంజిన్ సెస్నా గ్రాండ్ కారవాన్ విమానం విమానం నోమ్ సమీపంలో గల్లంతైంది. అందులో పైలట్ సహా 10 మంది ప్రయాణికులున్నారు.
మరో అరగంటలో ల్యాండవనుండగా రాడార్‌తో సంబంధం కోల్పోయింది. చిట్టచివరి లోకేషన్ ఆధారంగా హెలికాప్టర్‌తో అధికారులు గాలింపు చేపట్టి, గడ్డకట్టిన సముద్ర జలాల్లో శకలాలను కనుగొన్నారు. విమానంలో సాంకేతిక లోపం, ఇతర సమస్యలపై ప్రమాదానికి ముందు ఎలాంటి హెచ్చరికలు తమకు అందలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.