వాషింగ్టన్: చైనా భారీ నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన ఘటన మరువకముందే అగ్రరాజ్యంలో మరో గగనతల ఉల్లంఘన ఉదంతం చోటుచేసు కుంది. అలాస్కాలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని వైట్‌హౌస్ తెలిపింది. ‘పౌర విమానాల రాకపోకలకు కాస్తంత విఘాతం కల్గించేదిగా ఉన్న వస్తువును కూల్చేశాం. శిథిలాలను వెతికే పనిలో ఉన్నాం’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ చెప్పారు.
‘ 40వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువును 24 గంటలపాటు నిశితంగా పరిశీలించాక అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలమేరకు యుద్ధవిమానం కూల్చేసింది. అది గడ్డ కట్టిన అమెరికా సముద్రజలాల్లో పడింది’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్ (వ్యూహాత్మక కమ్యూనికేషన్స్) జాన్ కిర్బీ మీడియాతో చెప్పారు. ‘‘ఇటీవల కూల్చేసిన చైనా నిఘా బెలూన్‌కు స్వయం నియంత్రణ, గమన వ్యవస్థ ఉన్నాయి. సున్నిత సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది. కానీ ఈ వస్తువు ఏం చేసిందనేది ఇంకా తెలియదు’’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment