
అలస్కాలో భూకంపం
వాషింగ్టన్ : అలస్కాలోని దక్షిణ అట్కాలోని శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదు అయింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే సునామీ వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది.దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.