మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్‌-అమెరికా సైనికులు | Ex Yudh Abhyas 21: India US Soldiers Play Kabaddi During Joint Training Exercise | Sakshi
Sakshi News home page

Ex Yudh Abhyas 21: మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్‌-అమెరికా సైనికులు

Published Mon, Oct 18 2021 9:59 AM | Last Updated on Mon, Oct 18 2021 10:32 AM

Ex Yudh Abhyas 21: India US Soldiers Play Kabaddi During Joint Training Exercise - Sakshi

కబడ్డీ ఆడుతున్న అమెరికా-భారత్‌ సైనికులు

వాషింగ్టన్‌: భారత్‌-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో మన దేశం ఆర్మీ తరపున 350 మంది జవాన్లు పాల్గొంటుండగా.. అమెరికా నుంచి 300 మంది సైనికులు హాజరవుతున్నారు. అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు... భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది.

ఈ క్రమంలో శనివారం ఇరు దేశాల సైనికులు కలిసిపోయి.. రెండు జట్లుగా ఏర్పడి కబడ్డీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్నాయి. అమెరికన్‌ సైన్యం మన కబడ్డీ కూత మోత మోగించగా.. భారత జవాన్లు ఫుట్‌బాల్‌ పోటీలో గోల్స్‌ మీద గోల్స్‌ చేశారు.. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు... నాలుగు మిశ్రమ జట్లుగా ఏర్పడి పోటీ పడి.. క్రీడా స్ఫూర్తిని చాటారు. 
(చదవండి: మేరా భారత్‌ మహాన్‌: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి)

మంచులో సందడి
ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు మంచును విసురుకుంటూ ఎంజాయ్‌ చేశారు.. భారత్‌-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు. భారత్‌- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్‌లో జరిగాయి.

చదవండి: ఒక మెట్టు కాదు... వంద మెట్లు పైకెదిగాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement