అలాస్కా: సముద్రంలో మనుషులకు తెలియని ఎన్నో వింతజీవులు, జలచరాలు తరుచూ కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తాయి. అటువంటి ఓ సముద్ర వింత జీవి అలాస్కాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ద్వీపం దగ్గర ఉన్న సముద్ర తీరంలో దర్శనమిచ్చింది. ఈ వింత సముద్ర జీవికి సంబంధించిన వీడియోను సారా వాసర్ అల్ఫోర్డ్ అనే మహిళ ‘ గ్రహంతర జీవిగా కనిపిస్తున్న కొత్త సముద్రపు జీవి’ అనే ట్యాగ్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన శరీరాన్ని సాగదీస్తూ, మెలికలు తిప్పుతూ వింతగా కదులుతున్న ఈ అరుదైన సముద్రజీవిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కదులుతున్న సమయంలో జీవి శరీరంలోని రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. ‘ఇప్పుడు భూమిపై ఉన్న వింతైన గ్రహాంతర జీవి’ అని కొంతమంది...‘ఇది సముద్రంలోని పగడపు జీవి.. మెలికలు తిరిగే స్టార్ ఫిష్ .. దాన్ని మళ్లీ సముద్రంలో వదిలేయండి’ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీటిపై స్పందించిన సారా వాసర్.. ‘ఈ సముద్ర జీవి.. స్టార్ ఫిష్ జాతికి చెందిన ‘బాస్కెట్ స్టార్’ అని.. దాన్ని తిరిగి సముద్రంలోకి వదిలేస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment