అలస్కా : అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ‘బస్సు 142’ను హెలీకాప్టర్ సహాయంతో తరలించారు. రియల్ స్టోరీతో తెరకెక్కిన ‘ఇన్ టు ది వైల్డ్’ చిత్రం అంటే సాహసికులు అమితంగా ఇష్టపడతారు. డబ్బుతో పనిలేకుండా కేవలం ప్రకృతితో కలిసి జీవించాలనుకునే వ్యక్తి క్రిస్ మెక్‌కాండ్లెస్(24). ఆయన సాహస యాత్రకు వెళ్లి 1992లో మరణిస్తాడు. ఇతనికి సంబంధించిన కథే ‘ఇన్ టు ది వైల్డ్’. మెక్‌కాండ్లెస్ ఆశ్రయం పొందిన బస్సునే మ్యాజిక్ బస్‌గా పిలుస్తారు. అయితే అలస్కా ఆర్మీ నెషనల్ గార్డ్, అలస్కాలోని సహజ వనరుల విభాగం కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి, ఈ బస్సును హెలీకాప్టర్ సహాయంతో అక్కడి నుంచి తరలించారు.(గాల్వన్ లోయ మాదే : చైనా)
1940 దశకానికి చెందిన ఫెయిర్‌బ్యాంక్స్ సిటీకి చెందిన ఈ బస్సును సందర్శించడానికి ఎన్నో ప్రమాదకరమైన ప్రాంతాలను దాటుకుని వెళ్లాలి. స్టాంపెడ్ ట్రయల్ మార్గం గుండా హీలీ సమీపంలోని మారుమూల ప్రాంతాల మీదుగా టెక్లానికా నది దాటుకుని ఈ బస్సు ఉన్న చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమై యాత్ర.
1961లో రోడ్డు నిర్మాణ పనులు చేసే సమయంలో కార్మికులు షెల్టర్ కోసం ఈ బస్సును వాడి అనంతరం అక్కడే వదిలేసివెళ్లారు. అయితే ఒంటరిగా ప్రపంచానికి దూరంగా సొంతంగా బతకాలనుకున్న క్రిస్ మెక్‌కాండ్లెస్‌కి ఈ బస్ కనిపిస్తుంది. కొద్దికాలం బస్సులో జీవించి తర్వాత తిరిగి వెళ్లాలనుకుంటాడు. కానీ, ఆ సమయానికి టెక్లానికా నది ఉదృతంగా ప్రవహించడంతో దాటడం కష్టం అవుతుంది. దీంతో తిరిగి బస్సులోకి వస్తాడు. ఇక ఆ బస్సులోనే దాదాపు 113 రోజులు గడిపి అనంతరం చనిపోతాడు. అయితే అతని సాహాస యాత్రలోని ప్రతీ విషయాన్ని తన పుస్తకంలో రాసుకుని, ఫోటోలు తీసి పెట్టేవాడు. అనంతరం అతని అనుభవాల ఆధారంగా జాన్ క్రాకోర్ 1996లో ‘ఇన్ టు ది వైల్డ్’ పుస్తకాన్ని రాశాడు. ఈ కథనే తర్వాత 2007లో చిత్రంగా తెరకెక్కి ప్రపంచం వ్యాప్తంగా మంచి హిట్ అయింది. ఇక కథను తెలుసుకున్న ఎందరో సాహసికులు ఆ బస్సును చూడాలని, ఎంతో ప్రమాదకరమైన యాత్రను చేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు మృతిచెందగా, మరెందరో గాయాలపాలవుతున్నారు. (కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది)
‘అలస్కా ప్రకృతి అందాలను చూడటానికి వచ్చే వారి భద్రత మాకు ముఖ్యం. బస్సును చూడాలని కొందరు యాత్రికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీరిని కాపాడటానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కొందు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు’ అందుకే బస్సును తరలిస్తున్నామని అలస్కాలోని సహజ వనరుల విభాగం అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment