wild
-
కోకాపేట్‌లోని బఫెలో వైల్డ్ వింగ్స్.. ఆటిజంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం..(ఫొటోలు)
-
ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!
అన్నం కోసం వెళ్తే.. అమృతం దొరికినట్లు.. మూవీ చూద్దామని వెళ్తే.. మెగాస్టార్ ఎదురొచ్చినట్లు..కొన్నిటిని వర్ణించడానికి మాటలు సరిపోవు.. అలాంటి సన్నివేశమే ఇది.. ఉరిశిక్ష పడి.. నేడో రేపో ప్రాణం తీసేస్తారు అన్నోడికి సడన్‌గా క్షమాభిక్ష పెట్టేస్తే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? తెలీదు కదా.. కొంచెం అటూఇటూగా ఇలాగే ఉంటుందేమో.. ఓసారి పులిగారి మనోభావాలను గమనించండి.. ఇంతకీ విషయమేమిటంటే.. చాలాకాలం బోను వెనుకాల బందీగా ఉన్న పులికి ఒక్కసారిగా స్వాతంత్య్రం ప్రకటించేసి.. అడవిలో వదిలేయడానికి తెచ్చారు. బోను తలుపు తీయగానే.. అడవిని చూసి పులి ఇలా షాక్ తింది.. పలు జంతువులను ఇటీవల అడవిలో వదిలినప్పుడు అవి ఎలా ఫీలయ్యాయి అన్నది ఓ వీడియో తీశారు. అందులోనిదే ఈ పులి చిత్రం..ఆస్కార్ లెవల్ యాక్టింగ్ కదా.. -
హెలీకాప్టర్‌తో ‘మ్యాజిక్ బస్సు’ తరలింపు
అలస్కా : అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ‘బస్సు 142’ను హెలీకాప్టర్ సహాయంతో తరలించారు. రియల్ స్టోరీతో తెరకెక్కిన ‘ఇన్ టు ది వైల్డ్’ చిత్రం అంటే సాహసికులు అమితంగా ఇష్టపడతారు. డబ్బుతో పనిలేకుండా కేవలం ప్రకృతితో కలిసి జీవించాలనుకునే వ్యక్తి క్రిస్ మెక్కాండ్లెస్(24). ఆయన సాహస యాత్రకు వెళ్లి 1992లో మరణిస్తాడు. ఇతనికి సంబంధించిన కథే ‘ఇన్ టు ది వైల్డ్’. మెక్కాండ్లెస్ ఆశ్రయం పొందిన బస్సునే మ్యాజిక్ బస్‌గా పిలుస్తారు. అయితే అలస్కా ఆర్మీ నెషనల్ గార్డ్, అలస్కాలోని సహజ వనరుల విభాగం కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి, ఈ బస్సును హెలీకాప్టర్ సహాయంతో అక్కడి నుంచి తరలించారు.(గాల్వన్ లోయ మాదే : చైనా) 1940 దశకానికి చెందిన ఫెయిర్‌బ్యాంక్స్ సిటీకి చెందిన ఈ బస్సును సందర్శించడానికి ఎన్నో ప్రమాదకరమైన ప్రాంతాలను దాటుకుని వెళ్లాలి. స్టాంపెడ్ ట్రయల్ మార్గం గుండా హీలీ సమీపంలోని మారుమూల ప్రాంతాల మీదుగా టెక్లానికా నది దాటుకుని ఈ బస్సు ఉన్న చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమై యాత్ర. 1961లో రోడ్డు నిర్మాణ పనులు చేసే సమయంలో కార్మికులు షెల్టర్ కోసం ఈ బస్సును వాడి అనంతరం అక్కడే వదిలేసివెళ్లారు. అయితే ఒంటరిగా ప్రపంచానికి దూరంగా సొంతంగా బతకాలనుకున్న క్రిస్ మెక్కాండ్లెస్కి ఈ బస్ కనిపిస్తుంది. కొద్దికాలం బస్సులో జీవించి తర్వాత తిరిగి వెళ్లాలనుకుంటాడు. కానీ, ఆ సమయానికి టెక్లానికా నది ఉదృతంగా ప్రవహించడంతో దాటడం కష్టం అవుతుంది. దీంతో తిరిగి బస్సులోకి వస్తాడు. ఇక ఆ బస్సులోనే దాదాపు 113 రోజులు గడిపి అనంతరం చనిపోతాడు. అయితే అతని సాహాస యాత్రలోని ప్రతీ విషయాన్ని తన పుస్తకంలో రాసుకుని, ఫోటోలు తీసి పెట్టేవాడు. అనంతరం అతని అనుభవాల ఆధారంగా జాన్ క్రాకోర్ 1996లో ‘ఇన్ టు ది వైల్డ్’ పుస్తకాన్ని రాశాడు. ఈ కథనే తర్వాత 2007లో చిత్రంగా తెరకెక్కి ప్రపంచం వ్యాప్తంగా మంచి హిట్ అయింది. ఇక కథను తెలుసుకున్న ఎందరో సాహసికులు ఆ బస్సును చూడాలని, ఎంతో ప్రమాదకరమైన యాత్రను చేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు మృతిచెందగా, మరెందరో గాయాలపాలవుతున్నారు. (కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది) ‘అలస్కా ప్రకృతి అందాలను చూడటానికి వచ్చే వారి భద్రత మాకు ముఖ్యం. బస్సును చూడాలని కొందరు యాత్రికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీరిని కాపాడటానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కొందు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు’ అందుకే బస్సును తరలిస్తున్నామని అలస్కాలోని సహజ వనరుల విభాగం అధికారి ఒకరు తెలిపారు. -
సత్యనిష్ఠ
‘ఆడిన మాట తప్పని రాజులు ఎవరైనా ఉన్నారా?’ అని ఇంద్రసభలో ఒకసారి చర్చ వచ్చింది. భూలోకంలో హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడని వశిష్టుడు చెప్పాడు. వశిష్ట విశ్వామిత్రులకు మొదటినుంచి వైరం ఉంది. అందువల్ల హరిశ్చంద్రుడి చేత ఎలాగైనా అబద్ధం చెప్పించాలని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి వద్దకెళ్లి తాను ఒక బృహత్తర యాగం తలపెట్టాననీ, దానికి విశేషంగా ధనం కావాలన్నాడు. యాగ నిర్వహణకు ఎంత అవసరమైతే అంత ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు. తనకు కావలసి వచ్చినప్పుడు వచ్చి ధనాన్ని తీసుకుంటానని విశ్వామిత్రుడు వెళ్లిపోయాడు. ఒకసారి హరిశ్చంద్రుడి రాజ్యంలోని కొందరు ప్రజలు వచ్చి తమ పైర్లన్నిటినీ అడవిమృగాలు పాడుచేస్తున్నాయని చెప్పడంతో వాటిని సంహరించేందుకు అడవులకు వెళ్లాడు. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించేందుకు రకరకాల కుయుక్తులు, కుట్రలు పన్నిన విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను సృష్టించి, హరిశ్చంద్రుని వద్దకు పంపాడు. వారు ఆయన వద్దకొచ్చి తమను పెళ్లాడమని కోరారు. హరిశ్చంద్రుడు తిరస్కరించాడు. వారిని విశ్వామిత్రుడు వెంటబెట్టుకుని వెళ్లి వారిని పెళ్లి చేసుకోమని ఆదేశించాడు. ఏకపత్నీవ్రతాన్ని తప్పనన్నాడు హరిశ్చంద్రుడు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు అతడు తన యాగానికి కావలసిన ధనాన్ని ఇస్తానన్న సంగతి గుర్తుచేసి, ఇప్పుడు అవసరమొచ్చింది, ఇమ్మన్నాడు. ఎంత ధనం ఇచ్చినా చాలదంటుండడంతో చేసేదేం లేక హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని, కొడుకు లోహితుణ్నీ తీసుకుని రాజ్యం విడిచి వెళ్లిపోయాడు. అదీ చాలదన్నాడు విశ్వామిత్రుడు. దాంతో కాశీనగరంలో చంద్రమతిని విక్రయించి, ఆ వచ్చిన ధనాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చాడు. అది కూడా చాలదన్నాడాయన. దాంతో తానే స్వయంగా ఓ కాటికాపరికి అమ్ముడుపోయాడు. ఓ రాత్రివేళ హరిశ్చంద్రుడి కొడుకు లోహితుణ్ణి పాము కరవడంతో అతను మరణించాడు. చంద్రమతి కొడుకు దేహాన్ని కాటికి తీసుకువెళ్లింది. సుంకం చెల్లించమన్నాడు కాటికాపరి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని వాపోయిందా ఇల్లాలు. ఆ మెడలోని మంగళసూత్రాలు అమ్మి చెల్లించమన్నాడు కాపరి. తన మాంగల్యం భర్తకు తప్ప ఇతరులెవరికీ కనపడదన్న వరం గల చంద్రమతి, ఆ కాటికాపరే తన భర్త హరిశ్చంద్రుడని గుర్తించింది. ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకుని దుఃఖపడ్డారు. సత్యధర్మాచరణలో భర్త అడుగుజాడల్లో నడిచే చంద్రమతి మంగళసూత్రాలు అమ్మి డబ్బు తెచ్చేందుకు నగరానికి వెళ్లింది. అర్ధరాత్రివేళ వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను భటులు రాజుగారి దగ్గరకు తీసుకు వెళితే ఆయన ముందు వెనకలు ఆలోచించకుండా ఉరిశిక్ష విధించాడు. భటులు ఆమె తలను నరికేందుకు తలారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తలారి ఎవరో కాదు, హరిశ్చంద్రుడే! విధినిర్వహణలో భాగంగా కత్తి తీసి ఆమె మెడ మీద పెట్టాడు హరిశ్చంద్రుడు. అది పూలమాల అయింది. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై అతని సత్యనిష్ఠను కొనియాడారు. హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడించలేకపోయానని ఒప్పుకుని అతని రాజ్యం అతనికి అప్పగించి ఆశీర్వదించి వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు. మాటకు ప్రాణం సత్యమే. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడే గొప్పవాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
చిన్ని రాజు చదువు చదువు
నాగావళి పర్వత శ్రేణులను ఆనుకుని ఒక అందమైన అడివి వుంది. ఆ అడివిలో పెద్ద పెద్ద మర్రి, టేకు, మద్దిలాంటి వృక్షాలు ఉన్నాయి. మామిడి, నేరేడు, జామ, వెలగ లాంటి పండ్ల చెట్లు ఉన్నాయి. పర్వత శ్రేణుల నుంచి వచ్చిన జలపాతాలు సరస్సులుగా, సెలయేర్లుగా ఆ అడివిలో అక్కడక్కడ నిర్మితమై ఎంతో ప్రకృతి శోభను తెచ్చాయి. ఆ అడవికి సంజయుడు అనే మృగరాజు రాజుగా వున్నాడు. సంజయుని పాలనలో అన్ని జంతువులూ ఏ భయం లేకుండా నివసిస్తున్నాయి. కానీ మహారాజుకు సంతానం లేదనే బాధ అందరిలోనూ ఉంది. కొంత కాలానికి రాజుకు మగ సంతానం కలిగింది. మృగరాజు, భార్య సివంగి ఎంతో సంతోషించారు. అడవిలో జంతువులన్నీ పండుగ చేసుకున్నాయి. నామకరణం, పుట్టినరోజులు ఇలా చిన్న మృగరాజుకు జరిపాక, ఇక చిన్ని మృగరాజుకు చదువు నేర్పించాలని తలచాడు సంజయ మృగరాజు. కానీ లేక లేక కలిగిన సంతానం అతి గారం వలన చిన్ని మృగరాజు పెంకిగా తయారయ్యాడు. చిన్ని మృగరాజుకు విద్య నేర్పడానికి అడివిలో తెలివైన ఏనుగు, లేడి, ఓ కుందేలు, నక్క నియమించబడ్డాయి. అవి ఎంతో ఓర్పుగా చిన్ని మృగరాజుకు పాఠాలు చెప్పసాగాయి. అయితే చిన్ని మృగరాజు వింటేగా! ఏనుగు పైకెక్కి కూర్చోడం, నక్కను ఏడిపించడం, కుందేలును కొట్టడం లాంటి పనులు చేస్తూ .. అసలు పాఠాలు వినేవాడు కాదు. దాంతో అవి అన్నీ రాజుని కలిసి చిన్ని రాజుకు పాఠాలు చెప్పడం మావల్ల కాదని చెప్పేసాయి.సంజయ రాజుకు మరలా విచారం పట్టుకుంది. తాను రాజుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన తరువాత తన కొడుకు కూడా అలాగే అవ్వాలని తలచినా, చిట్టి మృగరాజు ఇలా తయారవడం బాధ కలిగించింది. అప్పుడు ఆ అడివిలో ఉండే ఒక కోతి రాజును కలసి ‘మహారాజా! మీ కుమారుని కోసం మీరు బెంగ పెట్టు కోవద్దు. ఒక ఆరు నెలలు చిన్ని రాజుని నాకు వదలి పెట్టండి. నేను ప్రయోజకుని చేసి మీకు అప్పగించుతాను’ అంది. ఏ పుట్టలో ఏ పాము వుందో .. మిగిలిన జంతువులు కూడా రాజుకు, కోతితో చిన్ని రాజుని పంపండి. అంతగా కాకపోతే అప్పుడే వేరొక మార్గం ఆలోచిద్దాం అన్నాయి. విధిలేని పరిస్థితిలో రాజు, చిన్ని రాజును కోతికి అప్పగించాడు. ‘‘నువ్వా .. నాకు పాఠాలు చెప్పేది’’ అన్నాడు చిన్ని రాజు. ‘‘పాఠలా .. మరేమన్నానా .. నాకే ఏమీ రావు. ఇక మీకు చెప్పేది ఏమున్నది. నేనలా అనక పోతే మిమ్మలి వేరొక ఆడవికి పంపే ఆలోచనలో వున్నారు మహారాజు .. అందుకే ఇలా చెప్పాను. ఈ ఆరు నెలలూ మన మిద్దరం ఆడుతూ పాడుతూ గడిపేద్దాము. తరువాత సంగతి తరువాత’’ అంది కోతి.కోతి మాటలు చిన్ని రాజుకు బాగా నచ్చాయి. రెండూ కలసి అడివి లోకి పోయాయి. చెట్లు ఎక్కాయి. ఉయ్యాలలు ఊగాయి. సరస్సులలో స్నానాలు చేశాయి. చిన్నిరాజుకి కోతి బాగా నచ్చేసింది. ఇలా వారంలో ఆరు రోజులు గడిచాయి. అప్పుడు కోతి ‘‘చిన్ని రాజా మనం అప్పుడే ఆరు రోజులు ఆట పాటలతో కాలం గడిపాము. రేపు మహారాజు ‘మా చిన్ని రాజుకు నీవు ఏం నేర్పావు’ అంటే నేనేమీ చేప్పగలను.నేనేమీ చెప్పలేదు అంటే నా నుండి నిన్ను దూరం చేసి వేరే ఆడవికి పంపుతారు. కనుక ఈ ఒక్క రోజు నేను చెప్పిన పాఠం విని రేపు అందరి ముందు చెప్పేయి దానితో ఈ గండం గడుస్తుంది.తరవాత నుండి మరలా మామూలే .. మన ఆటలు.. పాటలు’’ అంది కోతి. కోతి చెప్పింది కూడా నిజమే అని తలచాడు చిన్ని రాజు. బుద్ధిగా కోతి నేర్పిన పాఠాలు నేర్చుకున్నాడు . పద్యాలు వల్లె వేశాడు. మరుసటి రోజు కోతి , చిన్ని రాజుని తీసుకుని సభకు వెళ్లింది. జంతువులన్నీ కోతి పని అయిపోయింది. ఈ వారం రోజులూ అది చిన్ని రాజుతో ఆడిన ఆటలు పాటలు అన్నీ చూశాయి. పెద్ద పెద్ద గురువులు చెప్పలేనిది తగుదునమ్మా అనుకుంటూ .. నేను పాఠం చెబుతానని తయారయింది అనుకున్నాయి. మహారాజు సంజయుడు చిన్ని రాజుని పక్కన కూర్చో బెట్టుకుని ‘‘చిన్నా .. నీవేమీ నేర్చుకున్నావు మీగురువు నీకేమి నేర్పారు?’’ అని అడిగాడు. ముందురోజు నేర్చుకున్న పద్యాలను పాడాడు చిన్ని మృగరాజు. ఎవరైనా మీదకు వస్తే ఎలా తప్పించుకోవాలో చేసి చూపాడు. మాటు వేసే వేటాడే పద్ధతులు చూపించాడు. ‘‘శహబాష్..’’ అంటూ చప్పట్లు కొట్టాడు మృగరాజు. కోతికి అనేక బహుమానాలు ఇచ్చాడు. ‘‘మహారాజా! .. ఇది కొంత మాత్రమే. నాకు ఇచ్చిన ఆరు నెలల గడువులో మీ చిన్ని రాజుని మీ అంత వాడిగా చేస్తాను’’ అంది కోతి. మిగిలిన జంతువులు కూడా కోతిని ప్రశంసించాయి. అక్కడ నుండి సెలవు తీసుకుని చిన్ని రాజుని తీసుకుని సెలయేరు దగ్గరకు పోయింది కోతి. ‘‘ చిన్నిరాజా..! ఈ చదువులతో .. విసుగు వచ్చింది. పద కాసేపు అదువుకుందాం అంది. రెండూ కలసి బాగా ఆడుకున్నాయి. వారం తరువాత ‘‘ఈసారి చదువుకు రెండూ రోజులు కేటాయిద్దాము’’ అంది కోతి. మరలా ఆ రెండు రోజులు చదువులో పడిపోయాడు చిన్నిరాజు.మరలా రాజు దగ్గర సభలో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పాఠాలు వినిపించాడు. మహారాజు , అన్నీ జంతువులు చిన్ని రాజుని, కోతిని తెగ పొగిడాయి. చిన్ని రాజుకు చాలా గర్వంగా అనిపించింది. అప్పుడు అంది కోతి ‘‘ చిన్ని రాజా! వారం లో రెండురోజులు చదివితేనే నీ కింత ఆదరణ లబిస్తోంది కదా! నువ్వు వారంలో ఒకరోజు ఆడుకుని మిగిలిన రోజులు చదువుకుంటే ఎంత గొప్పవాడివి అవుతావో ఊహించు’’ అంది. ‘‘అంతే కాదు నీకు మొదట విద్యా నేర్పడానికి వచ్చిన గురువులు చాలా తెలివైన వారు, వారి దగ్గర నేర్చుకుంటే నీకు చదువు ఇంకా బాగా వస్తుంది. పైగా నీవు ఈ అడవికి కాబోయే మహారాజువి.నిన్ను చూసి మిగిలివారు నేర్చు కోవాలి తెలిసిందా’’ అంది. కోతి మాటలతో చిన్ని రాజు జ్ఞానోదయం అయ్యింది. రాజుతో చెప్పి పెద్ద గురువుల దగ్గర విద్య నేర్చుకుంటానని తెలిపింది. ఆరోజు నుండి అందరితో వినయంగా వుంటూ ఆనతి కాలంలోనే అన్ని విద్యలూ నేర్చుకుంది. తనను మంచి మార్గంలో నిలిపిన కోతితో ఎప్పుడూ స్నేహంగా వుంటూ మంచి యువరాజుగా పేరు తెచ్చుకుంది. - కూచిమంచి నాగేంద్ర -
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు. సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది. -
ఇక్కడే బతుకుతం.. ఇక్కడే చస్తం
ఏటూరునాగారం : ప్రాణాలు పొయిన ఈ అడవి ఈడి ఏడికెల్లిపోం.. వలస వచ్చిన మా బతుకులను ఆగం చెత్తాండ్లు.. అడవిని నమ్ముకుని జీవి సున్నం. అటవీఅధికారులు ఇక్కడి నుంచి వెల్లగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. ఇక్కడే బతుకు తం.. ఇక్కడే చస్తం.’ అంటూ గొత్తికోయలు సోమవారం ఏటూరునాగారం మండలంలోని ఐటీడీఏ కార్యాలయూన్ని ముట్టడించారు. ఏటూరునాగా రం, మంగపేట, తాడ్వాయి మండలాలకు చెందిన వారు సుమారు వెయ్యి మంది రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు సున్నం బాబురావు మాట్లాడుతూ గొత్తికోయలపై దాడు లు చేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమో దు చేయాలని డిమాండ్ చేశారు. అడవిలోని టేకు, జిట్రేగి, పెద్దేగి కర్రలను కొందరు అటవీశాఖ అధికారులే స్మగ్లర్లతో కుమ్మకై రవాణా చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం మండల కార్యదర్శి దావూ ద్, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటరెడ్డి, గిరి జన నాయకులు నారాయణ, కిష్టయ్య,నాగరాజు, ఆంజీ, వెంకన్న, చిట్టిబాబు, ముత్యాలు, నర్రాశివప్రసాద్, మడె రమేష్, గొత్తికోయలు నాగరాజు, జోగయ్య, ఆంజయ్య పాల్గొన్నారు. ఎస్సై వినయ్‌కుమార్ ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. పోడు భూములకు హక్కుపత్రాలివ్వాలని ఏపీఓ జనరల్ వసంతరావుకు గిరిజన నేతలు వినతిపత్రం అందజేశారు. -
నిజమైన స్నేహితులు
కథ ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు నివసించేది. అది రోజూ వుధ్యాహ్నం ఆహారం వుుగించిన తర్వాత ఒక సెలయేటి వద్దకు వెళ్లి కడుపునిండా నీళ్లు తాగేది. ఒక రోజూ అలాగే నీశ్లు తాగి తిరిగి వెళ్తుండగా గడ్డి మీద నడుస్తున్న ఏనుగు కాలికి ఒక పెద్ద వుుల్లు గుచ్చుకుంది. ముల్లును తొలగించుకునేందుకు ఎంతగా ప్రయుత్నించినా, ఏనుగు ప్రయుత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యూరుు. అది వుధ్యాహ్నం వేళ... అదీ వేసవికాలం కావడంతో ఎండ వేడిమి తట్టుకోలేక, ఏనుగు కుప్పకూలిపోరుుంది. అడుగు తీసి అడుగు పెట్టడం కూడా చేతగాక ఏనుగు నీరుగారి పోరుుంది. ఏనుగు బాధతో ములుగుతుండగా అటువైపు వచ్చిన ఒక చిన్న అందమైన కుందేలు విషయుం తెలుసుకుని తెలివిగా ఏనుగుకాలిలో వుుల్లును తీసివేసింది. ఏనుగుకి ప్రాణం లేచి వచ్చినట్లయింది.కుందేలుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి లేచి వెళ్లిపోరుుంది. కొద్దిరోజుల తర్వాత కుందేలు తన బొరియును బాగు చేసుకుంటుండగా ఒక తోడేలు దాని మీద దాడిచేసేందుకు ప్రయుత్నించింది. అదే సవుయుంలో అటుగా వస్తున్న ఏనుగు తనను కాపాడిన కుందేలుకు ప్రాణగండం ఉండని గవునించి కుందేలును వచ్చి తన మీద ఎక్కి కూర్చోవుని బిగ్గరగా అరిచింది. అంతే! కుందేలు ఒక్క ఉదుటున ఏనుగు పెకైక్కి కూర్చుంది. ఏనుగును చూసిన తోడేలు భయుంతో తన కాళ్లకు బుద్ది చెప్పింది. ఆ రోజు నుండి ఏనుగు, కుందేలు ప్రాణస్నేహితులయ్యూరు. -
అమ్మో పులి!
అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు వారం రోజులుగా అటవీ సమీప నివాస ప్రాంతాల్లో సంచారం బర్డ్, రుయా సమీపంలో ఓ దూడ, కుక్కపై చిరుత దాడి ప్రేక్షక పాత్రలో అటవీ శాఖ అధికారులు తిరుపతి కార్పొరే షన్/మంగళం: అభయారణ్యంలో సంచరించాల్సిన క్రూర మృగాలు యథేచ్ఛగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎర్రచందనం అన్వేషణ, వన్య మృగాల వేట, నీరు లభించకపోవడంతో ఇవి జనావాసాల వైపు వస్తున్నా యి. రెండు రోజులుగా తిరుపతి రుయా, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రులతో పాటు సమీపంలోని భారతీయ విద్యాభవన్, ఎస్వీబీసీ శ్రీవారి నమూనా ఆలయం, వేదిక్, ఎస్వీయూ, ఎన్సీసీ నగర్, రీజనల్ సైన్స్ సెం టర్లో పులు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులకు సవాల్ విసురుతూ, సమీప జనావాసాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రుయా, బర్డ్ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రహరీ గోడపైకి చిరుతపులి ఓ కుక్కను, మరో లేగ దూడను తీసుకొచ్చి తిన్న సంఘటన గురువారం సంచలనం రేపింది. రుయాలోని ఐడీహెచ్ వార్డు విసిరేసినట్టు దూరంగా ఉండటం, చుట్టూ దట్టమైన చెట్లు, పొదలు ఉండడంతో వన్య మృగాలకు నిలయంగా మారుతోంది. 15 రోజుల క్రితం వేదిక్ వ ర్సిటీ, ఎన్సీసీ నగర్ వద్ద చిరుత జింకపై దాడి చేయడం, శ్రీవారిమెట్టు, మామండూరు సమీప గ్రామాల్లో సంచరించడం వంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఎప్పుడు పులి వచ్చి దాడి చేస్తుందోనని జనం భయపడుతున్నారు. రాత్రి స్మగ్లర్లు.. పగలు పోలీసులు.. అశేష వన్యమృగాలకు నిలయమైన శేషాచల అడవిలోకి ఎర్రచందనం కోసం స్మగ్లర్లు అడుగులు వేస్తున్నారు. రాత్రిపూట వృక్షాలను యథేచ్ఛగా నరికేస్తున్నారు. ఆ చప్పుడు కారణంగా వన్యమృగాల ప్రశాంతతకు భంగం కలుగుతోంది. రాత్రిల్లో ఆహార అన్వేషణలో భాగంగా సమీపంలోని జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రిళ్లు స్మగ్లర్ల బెడదైతే పగలు పోలీసుల అలజడి వన్యమృగాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేస్తున్న పోలీసులు మారణాయుధాలతో అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ ప్రభావం వన్యమృగాలపై పడుతోంది. ఆహారం కోసం కాకుండా తమ ఉనికి కోసం అడవిని ఖాళీ చేస్తున్నాయి. జనావాసాల్లోకి వస్తున్నాయి. వేట కూడా కారణమే... శేషాచల అడవుల్లోని వన్యప్రాణులు ఆహార అన్వేషణలో భాగంగా నీటి కోసం భాకరాపేట, ఎర్రావారి పాళెం, కళ్యా ణి డ్యాంల వద్దకు వస్తున్నాయి. నాటుతుపాకులు, విల్లంబులు, బరిసెలతో వేటగాళ్లు దాడి చేస్తుండడంతో వన్యమృగాలు అలజడికి గురవుతున్నాయి. వేటగాళ్ల దాడులకు భయపడి అటవీ సమీప గ్రామాల వైపు వెళ్తున్నాయి. అదే క్రమంలో కుక్కలు, ఆవులు, దూడలపై దాడి చేస్తున్నాయి. నీటి కోసం అన్వేషణ.. వర్షాభావం కారణంగా శేషాచల అడవుల్లో చెరువులు, కుంటలు ఇంకిపోతున్నాయి. దీంతో దాహం తీర్చుకునేందుకు అడవి జంతువులు సుదీర్ఘంగా పయనిస్తున్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో కృత్రిమంగా నీటి కొలనులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అక్కడక్కడా కొలనులు ఉన్నా వాటిలో నీటిని నింపడం లేదు. దీంతో నీటిని అన్వేషిస్తూ జనావాసాల్లోకి వస్తున్నాయి. -
అడవి రాములు
వైయస్సార్ జిల్లా గాలివీడు మండలంలో ఉన్న ఆ ఊరు కాని ఊరి పేరు కమలామర్రి. అదో చిట్టడవిలో ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే అక్కడి నుంచి కనీసం ఎనిమిది కిలో మీటర్లు కాలిబాటన నడవాల్సిందే. వేరే దారిలేదు. అలాంటి ప్రదేశంలో నలభైఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు రాములు, రవణమ్మ. వ్యవసాయం దండగ అంటున్న పెద్దలకు కనువిప్పుగా నిలుస్తున్న ఆ రైతు దంపతుల జీవనం గురించి రాములు మాటల్లో... నా స్వగ్రామం మాధవరం గ్రామం నాగిరెడ్డి గారిపల్లె కాలనీ. నలభై ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న. తరువాత ఇక్కడే ఈ అడవిలో స్థిరపడిపోయా. మా అత్త వీరనాగమ్మ, మామ సుబ్బరాయుడు. వాళ్లకి నా భార్య రవణమ్మ ఒక్కతే కూతురు. ఆయనకు అప్పటికే టీబీ ఉంది. తనెక్కడ కూతురు పెళ్లి చేయలేకపోతానోనన్న బెంగతో బాధపడుతూ నన్ను ఇల్లరికం తీసుకొచ్చి ఆయన కూతుర్నిచ్చి చేశాడు. మాపెళ్లి అయిన ఆరు నెలలకే ఆయన చనిపోయాడు. తరువాత నేను, నా భార్య, మా అత్త మేము ముగ్గురమే అ అటవీ ప్రాంతంలోనే నివాసం ఏర్పరుచుకున్నాం. మా మామకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు బావులు తవ్వించి పెట్టారు. ఆ బావులను ఆధారంగా చేసుకొని కవ్వెళ్లు వేసి సేద్యం చేశాను. తరువాత కొంత కాలానికి ఆయిల్ ఇంజన్ వేసి సేద్యం చేయడం మొదలు పెట్టాను. పిల్లలంతా ప్రయోజకులయ్యారు మాకు నలుగురు పిల్లలు. మొదట అమ్మాయి పుట్టింది. ఆమె మాత్రం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టింది. మిగిలిన ముగ్గురూ ఈ అడవిలోనే. ఈ ముగ్గురికీ మా సీతమ్మవ్వే పురుడు పోసింది. అందరిలాగానే మేము కూడా మా బిడ్డల్ని మంచి ప్రయోజకులను చేయాలనే ఆశతో వారిని బాగా చదివించాం. మొదటి కూతురు నాగేశ్వరి బీఈడీ చేసింది. రాయచోటి పట్టణంలోని దిగువ అబ్బవరంలో పెళ్లి చేశాం. రెండవ వాడు నాగరాజు కర్నూల్లో బీటెక్ పూర్తి చేసి బెంగుళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడవ వాడు మనోహర్ ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక చివరి అమ్మాయి మేఘన. ఈమె కూడా ఎమ్మెస్సీ కంప్యూటర్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరికి వివాహం అయ్యింది. భూమినే నమ్ముకున్నాం మేమిద్దరం, మాకు తోడుగా మా అత.్త ఈ భూమినే నమ్ముకున్నాం. ఇప్పటి వరకు ఏనాడూ ఈ భూమాత మమ్మల్ని నష్ట పెట్టలేదు. కరెంట్ కూడా లేకుండా ఇలా చీకటిలోనే సేద్యం చేశాను. ఇక చేయడం కష్టంగా మారింది. కరెంటోళ్లకు 1995లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా డబ్బులు కట్టాను. పోళ్లు ఇచ్చారు. వైరు ఇవ్వడం మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ డబ్బులు కట్టమంటున్నారు. నిత్యం పందులు, ఎలుగుబంటులతో సహవాసం చేసిన వాళ్లం. చుట్టపు చూపుగా అప్పుడప్పుడు క్రూర జంతువులు వస్తుంటాయి. అయినా ఎలాంటి భయం లేకుండా బతుకుతున్నాం. ఇప్పటి వరకు మాకు సెల్ ఫోన్ లేదు. టివి లేదు. కరెంట్ లేదు. అలాగే బతికేశాం. బతుకుతున్నాం. ఇటు అన్నలు, అటు పోలీసులు అప్పుడెప్పుడో గుర్తుకు లేదు కానీ, అన్నలు తిరుగుతున్న సమయంలో అర్ధరాత్రి అయితే వచ్చి బువ్వ పెట్టమని భయపెట్టేవాళ్లు. పెట్టకపోతే చంపుతామని అనేవాళ్లు. బిడ్డలోళ్లం కదా భయపడి బువ్వ పెట్టి పంపేవాళ్లం. తెల్లవారితే పోలీసులు వచ్చి బెదిరించే వాళ్లు. ఇలా బాధలు భరించామే కానీ, ఏనాడూ భూమిని వదిలేందుకు ఇష్టపడలేదు. ఈ నలభై ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇంతటి కరువును చూడలేదు. ఇప్పుడున్న రెండు బావుల్లో నీరు అడుగంటిపోయాయి. బోర్లు వేసుకుందామన్నా కరెంట్ లేదు. కరెంట్ ఇస్తే బోరు వేసుకుంటాం. ఫొటోలు: పి రాజమోహన్, రాయచోటి కార్డుల వల్ల ఒరిగిందేమీ లేదు రకరకాలుగా పంటలు సాగు చేస్తాం. వరి, వేరుశనగ, కూరగాయలు, పొద్దుతిరుగుడు, మల్బరీ రేషం పంటలు పండించేవాళ్లం. ఎంత లేదన్నా ఏడాదికి లక్ష వరకు ఆదాయం తెచ్చేవాణ్ణి. అందుకే నా బిడ్డలను గొప్ప గొప్ప చదువులు చెప్పించాను. నాకు రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నాయి. కానీ ఏనాడూ వాటి వల్ల మాకు ఒరిగిందేమి లేదు. -
వన రక్షక వనితలు
అడవి తల్లి రక్షణలో ఆడమగ తారతమ్యం లేకుండా స్మగ్లర్లకు సింహస్వప్నంగా నిలుస్తూ వనాన్ని రక్షిస్తున్న వనితలు వారు. ఏటూరునాగారం, మంగపేట, అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో మహిళా బీట్ అధికారులుగా పనిచేస్తూ తమలో అణువణువు ధైర్య సాహసాలు నిండి ఉన్నాయని నిరూపిస్తున్నారు. విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధించిన విజయాలు, శత్రువు ఎదురైనప్పుడు ఎదుర్కొనే తీరు.. తదితర విషయాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. - ఏటూరునాగారం ఏటూరునాగారం, మంగపేట, మండలాల్లోని సుమారు 37 గ్రామ పంచాయతీల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయి. అడవులను రక్షించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు నిరంతరం తపిసున్నారు మహిళా బీట్ అధికారులు. అడవిలోని చెట్లు నరికివేతకు గురికాకుండా నిత్యం నిఘా కాస్తున్నారు. అటవీ సంపద స్మగ్లర్ల బారిన పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కళ్లు చించుకున్నా ఒక్క మనిషి కూడా కనబడని అడవిలో సంచరిస్తూ అడవికి రక్షణగా నిలుస్తున్న ధీరవనితలు.. విధినిర్వహణలో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మనసు విప్పి మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. మృగాలు ఎదురైతే చెట్లు ఎక్కుతాం అడవిలో సంచరించే క్రమంలో ప్రమాదకరమైన జంతువులు ఎదురైతే చెట్లు ఎక్కి నక్కి కూర్చుంటాం. అవి వెళ్లే వరకు శబ్దం చేయకుండా ఉండిపోతాం. అలాగే కొంతమంది జంతువులను హతమార్చేందుకు విద్యుత్ తీగలతో ఉచ్చులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఎండిపోయిన కర్రలను ముందుకు జరుపుకుంటూ అడవిలోకి వెళ్తాం. ఒక వేళ విద్యుత్ తీగలతో ఉచ్చు ఉంటే వెంటనే ఎండు కర్ర కాలిపోతుంది. ఇలా రక్షించుకుంటాం. ఎక్కువగా వాగులు, వంకలు ఉన్న ప్రాంతంలో జంతువులు వస్తాయని వేటగాళ్లు ఉచ్చులు పెడుతుంటారు. ఆ ప్రాంతాలను ముందే పసిగట్టి అడవిలోకి వెళ్తుంటాం. జంతువుల అడుగుల ఆధారంగా ఎలాంటి జంతువు అనేది గుర్తిస్తాం. - సింగారపు రజిత, ఏటూరు బీట్ అధికారి వర్షాకాలంలో టేకాకులే గొడుగులు వర్షాకాలంలో అడవిలో సంచరించే క్రమంలో వర్షం కురిస్తే టేకు ఆకులు, ఇతర పెద్ద ఆకులను గొడుగులా ఏర్పాటు చేసుకుని తలపై పెట్టుకుంటాం. ఇలా తలదాచుకోవడానికి దగ్గర్లో ఉండే రాతి గుహలు, బండరాళ్ల నీడలో తలదాచుకుంటాం. ఎక్కువగా వర్షం పడితే తడిసిపోక తప్పదు. వర్షాకాలంలో అడవుల్లో పచ్చదనం ఎక్కువగా ఉండడంతో పాములు, విషకీటకాలతో హాని కలిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పొడుగాటి షూ ధరించి వెళ్తుంటాం. విషకీటకం కుడితే తెలిసిన వైద్యం చేసుకుని గ్రామాల్లోకి రావడానికి ప్రయత్నిస్తాం. కుర్సం తార, ముల్లకట్టం, రాంపూర్ బీట్ అధికారిఅ ఊట నీళ్లే మాకు తాగునీరు అడవిలోని చెట్లకు నంబర్లు రాసేందుకు వెళ్లే క్రమంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలినడకన వెళ్లాలి. అలా వెళ్లే క్రమంలో దాహం వేస్తే అడవిలో ఉండే ఊ ట నీళ్లను తాగేందుకు ఉపయోగిస్తాం. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉం టుంది. కొన్నిసార్లు అడవిలో రెండు రో జు లపాటు ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో అడవిలో దొరికే పండ్లు తింటూ కడుపునింపుకుంటాం. చెట్లు నరికివేతకు గురైతే దానిమీద ఉన్న గుండ్రని గీత ల ఆ దారంగా వాటి వయసు గుర్తిస్తాం. దీ ని వల్ల ఆ కలపను త్వరగా గుర్తుపట్టి పట్టుకు నే వీలుంటుంది. విధి నిర్వహణలో ఆ టుపోట్లు ఉన్నా సంతోషంగా పనిచేస్తున్నాం. - కొర్నిబెల్లి శోభారాణి, తిమ్మాపురం బీట్ అధికారి పసిగట్టి పట్టుకుంటాం రాత్రివేళ స్మగ్లర్ కలపను అక్రమంగా తరలించుకుపోతున్నాడని సమాచారం అందితే సిబ్బందితో కలిసి బేస్‌క్యాంపునకు చేరుకుంటాం. ఎవరికీ అనుమానం రాకుండా నెగడు చాటునుంచి ఎడ్లబండ్ల కదలికలు గుర్తు పడతాం. తర్వాత బండ్లు ఎటువైపు వెళ్తున్నాయనే విషయాన్ని పసిగట్టి రక్షణ కోసం కర్రలతో కాపుకాస్తాం. అవి రాగానే అందరం ఒకేసారి పెద్దగా అరుస్తూ పట్టుకుంటాం. ఇటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. -కాక విజయ, తొండ్యాల లక్ష్మీపురం బీట్ అధికారి -
దేవుడిచ్చిన రూపం
ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. ఆ అడవిలో పుష్కలంగా దొరికే పచ్చగడ్డిని తిని ఎత్తుగా, బలంగా తయారయ్యింది. దానితో అది తన ఆకారాన్ని చూసుకుని విర్ర వీగి పోయేది. ఒకరోజు గుర్రానికి నీటి కాలువ దగ్గర ఒక ఒంటె కనబడింది. ఒంటె ఆకారాన్ని చూడగానే దానికి నవ్వొచ్చింది. పడీ పడీ నవ్వసాగింది. ‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అని అయోమయంగా అడిగింది ఒంటె. ‘‘నువ్వెలా ఉంటావో నీకు తెలుసా? ఒంకర్లు తిరిగిన పెద్ద మెడ, వీపు మీద ఇంత మూట, సన్నటి పొడవైన కాళ్ళు... మొత్తానికి నీ రూపు భలేగా ఉంటుందోయ్’’ అని సకిలించుకుంటూ నవ్వింది గుర్రం. గుర్రం మాటలకు ఒంటె బాధ పడింది. జవాబు చెప్పకుండా మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు గుర్రానికి ఒంటె అక్కడే తారసపడింది. ‘‘ఏమిటోయ్ మిత్రమా! ఎలా ఉన్నావు?’’ ఒంటెను పలకరించింది గుర్రం. ‘‘నీ కోసమే వచ్చాను మిత్రమా! నీ అందమైన రూపం గురించి నిన్న నా స్నేహితులతో చెప్పాను. కానీ వాళ్ళు ‘అసలు అంత అందమనేది ఉంటుందా?’ అని ఆశ్చర్యపోయారు. నేను కోతలు కోస్తున్నానని వెక్కిరించారు. నాకు చాలా అవమానంగా అనిపించింది. నిన్ను వాళ్ళకు చూపించి వాళ్ళ నోళ్ళు మూయించాలని ఉంది. నువ్వు నాతో వస్తావా?’’ అంది ఒంటె. అది విని గుర్రం తన అందాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చిందని సంతోషించింది. వెంటనే ఒంటె వెంట బయలుదేరింది. కొద్దిసేపు అడవిలో ప్రయాణించాక ఒంటె గుర్రాన్ని తీసుకుని అడవిని దాటి ఎడారి వైపు ప్రయాణం కొనసాగింది. ఇసుకలో చకాచకా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న ఒంటెను అనుసరించడానికి ఇబ్బంది పడింది గుర్రం. దాని కాళ్లు ఇసుకలో కూరుకుపోయి అడుగుపడటం కష్టమైపోయింది. ‘‘త్వరగా నడువు మిత్రమా! నా స్నేహితులంతా నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు’’ అంటూ ఒంటె నడక వేగం పెంచింది. మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రంగా ఉంది. వేడిగాలులు వీస్తున్నాయి. అప్పుడప్పుడు వీచే బలమైన గాలికి ఇసుకరేణువులు గుర్రం ముక్కులోకి, కళ్ళలోకి దూరిపోతున్నాయి. దాహంతో కాలుక పిడచ కట్టుకుపోగా ‘‘ఇంకెంత దూరం నడవాలి?’’ అని గుర్రం భయంగా అడిగింది. ‘‘ఇంకో గంట నడవాలి’’ అని చెప్పింది ఒంటె. మరికొంత దూరం వెళ్ళగానే ఇక గుర్రం అడుగులు ముందుకు వేయలేక పోయింది. ‘‘నేనింక నడవలేను.’’ అంటూ ఇసుకలో చతికిలపడిపోయింది గుర్రం. ‘‘చూసావా మిత్రమా! ఎవరికి ఏ రూపం అవసరమో వారికి అలాంటి రూపమే ఇస్తాడు దేవుడు. నేను అందంగా లేనని గేలి చేసావు. ఎంతో అందంగా, బలంగా ఉన్నానని విర్రవీగావు. ఇప్పుడు ఏమైంది? ఎడారిలో నివసించడానికి వీలుగా నా రూపం ఇలా ఉంది. అది అర్థం చేసుకో’’ అని చెప్పింది ఒంటె. తన తప్పు తెలిసివచ్చిన గుర్రం సిగ్గుతో తల వంచుకుంది. నీతి: దేవుడు ఎవరి అవసరానికి తగిన ఆకారాన్ని, రూపాన్ని వారికి ఇస్తాడు. దాన్ని చూసుకుని పొంగిపోవటమూ, కుంగిపోవటమూ కూడా తప్పే! దానివల్ల ముప్పే! -
వ్యవసహాయదారుడు...
అడవిలో... రెండు దారులు చీలి ఉన్నాయి. నేను బాటసారినై, ఒక్కడినే రెండు దారుల్లో వెళ్లలేను. ఆ విచారంతో... దట్టంగా పెరిగిన పొదలలో మలుపు తిరిగే వరకూ నాకు కనిపించిన ఒక దారిని గమనిస్తూ... చాలాసేపు ఆలోచిస్తూ నిలుచున్నాను. నేను అదే బాట పట్టాను..! రాబర్ట్ఫ్రాస్ట్ అనే ఆంగ్ల కవి రాసిన ‘ద రోడ్ నాట్ టేకెన్’ కవితలోని కొన్ని పంక్తులు ఇవి. ‘తక్కువమంది నడిచిన తోవను నేను ఎంచుకొన్నాను, అదే నా జీవితాన్ని మలుపు తిప్పింద’ని అంటాడు ఫ్రాస్ట్. ఏదో ఒక దారిని ఎంచుకోవాల్సిన సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదురవుతుంటాయి. ఆ సమయంలో తక్కువగా నలిగిన దోవను ఎంచుకొనే వాళ్లు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు తాహెర్ సర్తల్వాలా. భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట వింటూనే ఉన్నాం కానీ... మన దేశంలోని చాలా వ్యవస్థలు ఇంకా మధ్యయుగం పరిధిని దాటి రాలేదు. అలాంటి వాటిల్లో వ్యవసాయం ఒకటి. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులు ఏ మాత్రం అభివృద్ధి చెందింది లేదు. ఒకవైపు కష్టపడుతున్నా సరైన ఒడుపులేకపోవడం వల్ల గిరిజనుల కష్టం రాళ్లపాలవుతోంది. చదువుకొంటున్న సమయంలోనే దీని గురించి అవగాహన ఉంది తాహెర్‌కు. పుట్టి పెరిగింది వ్యవసాయంతో సంబంధం లేని కుటుంబంలోనే అయినా... తాహెర్‌కు మాత్రం గ్రామీణ ప్రాంత స్థితిగతులపై ఎనలేని ఆసక్తి. వ్యవసాయం అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఇతడు ప్రస్తుతం తక్కువమంది నడుస్తున్న దారిని ఎంచుకొనేలా చేసింది. పుణే విశ్వవిద్యాలయంలో ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత ఏదో ఒక ఉద్యోగాన్ని చూసుకొని వెళ్లిపోవడం... లేదా తనకు ఆసక్తి, ఇష్టం ఉన్న గ్రామీణ పరిస్థితుల స్థితిగతుల గురించి అధ్యయనం చేసి... రైతుల్లో అవగాహన నింపడం... ఈ రెండింటిలో ఏ దారి ఎంచుకోవాలా అని సతమతమయ్యాడట తాహెర్. ఇలాంటి తరుణంలో రాబర్ట్ ఫ్రాస్ట్లాగా నలగని దారిలో నడిచాడు. ఆ పయనంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకొన్న గమ్యాన్ని చేరాడు. ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచాడు. తాహెర్ ఈ బాటలో నడవడానికి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా వారు సహకారం అందించారు. గ్రామీణుల గురించి, గ్రామాల్లోని పరిస్థితుల గురించి ఆలోచించే తీరిక ఉన్న భారతీయ యువత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లోని రైతులు చేసే సేద్యంపై అధ్యయనం చేయాలని సంకల్పించాడు తాహెర్. అందుకు గుజరాత్ దక్షిణ ప్రాంతంలోని మొలంబా గ్రామాన్ని ఎంచుకొన్నాడు. ఆ గిరిజన ప్రాంతంలోని రైతులు సంప్రదాయ వ్యవసాయంతో నష్టపోతున్న తీరు అతి తక్కువ సమయంలోనే అర్థమైంది తాహెర్‌కు. వ్యవసాయ పనుల్లో భాగంగా రైతులు ప్రతి ఏటా కొండలకూ, పంట కోత తర్వాత పంటభూములకూ నిప్పుపెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎండిపోయిన గడ్డితో ఉండే పంట పొలాలకు నిప్పుపెడతారు రైతులు. ఆ మంట పక్కనే ఉన్న చెట్లకు కూడా అల్లుకొంటుంది. చాలా ఎక్కువ విస్తీర్ణంలోని కొండ ప్రాంతం కాలిపోతుంది. ఇది ప్రతి ఏటా జరిగేదే! విషాదం ఏమిటంటే ఇలా చెట్టూచేమను కాల్చుకోవడం తమకు పంటకు మంచిదని అక్కడి రైతుల నమ్మకం. శతాబ్దాలుగా ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారు వాళ్లు. తాహెర్ అక్కడి రైతుల్లో ముందుగా ఈ విషయం గురించి అవగాహన నింపడానికి ప్రయత్నించాడు. వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగపడే ఎండుగడ్డి, ఇతర జీవావరణ నిక్షేపాలు (బయోమాస్)ను కాల్చివేయడం పంటకు తీవ్రమైన నష్టాన్ని కలగచేస్తుందని గిరిజన ప్రాంత రైతులకు వివరించాడు. కాల్చివేయడం వల్ల సారవంతమైన ఎరువు బూడిద కావడంతో పాటు మంటలు అడవికి కూడా అంటుకొని నష్టం కలిగిస్తున్న విషయాన్ని విశదీకరించాడు. అయితే ఆ గ్రామీణుల మనసు మార్చడం, వారిలో అవగాహన పెంచడం ఒకరోజులో జరిగిన పని కాదు. కొన్ని నెలల పాటు వారిలో ఒకరిగా మెలుగుతూ ప్రతి సందర్భంలోనూ వారికి జరుగుతున్న నష్టం గురించి తెలియజెప్పి, ఊరికి వ్యవసాయ శాస్త్రవేత్తలను తీసుకువచ్చి వారికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశాడు. సాయిల్ సోలరైజేషన్ ట్రీట్మెంట్ (ఎస్ఎస్టీ) పేరుతో అక్కడి భూసారాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల్లో అవగాహన కలిగించాడు. వ్యవసాయంపై ఎనలేని ఆసక్తి ఉన్న రైతులను ఇతడి పాఠాలు ఆకట్టుకొన్నాయి. వారు తమ సంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు వచ్చారు. అధునాతన పద్ధతుల పట్ల ఉత్సాహం చూపారు. నాలుగేళ్ళ క్రితం మొలంబా, చుట్టుపక్కల పల్లెల్లో ఈ యువకుడు పని మొదలుపెట్టాడు. ఇప్పుడు అక్కడి వ్యవసాయకార్యక్రమాల్లో మార్పులొచ్చాయి. అక్కడి ప్రజలు తాహెర్‌ను తమవాడంటారు. తమకు కొత్త దారి చూపిన వ్యక్తిగా గౌరవిస్తారు. అన్నదాతలు ఇచ్చే ఆ గౌరవం ఏ మల్టీనేషనల్ కంపెనీ ఏసీ రూమ్‌లోనో కూర్చొని పనిచేస్తుంటే లభించేది కాదనేది అతడి భావన. ప్రపంచం ఎంత ముందడుగు వేసినా వ్యవసాయాన్ని విస్మరించకూడదనీ, ఆ రంగంలో పనిచేయడం తనకు ఆత్మసంతృప్తినిస్తోందనీ ఈ యువకుడు చెబుతాడు. గొప్ప ఆలోచనా విధానమే! - జీవన్ రెడ్డి.బి -
ఎందుకు గౌరవించాలంటే...
ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని దాపులో ఒక తిత్తిరి పిట్ట, ఒక కోతి, ఒక ఏనుగు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ మూడూ కలిసి ‘‘మనలో ఎవరు పెద్దో తెలుసుకుందాం. ఆ పెద్దని మిగిలిన రెండూ గౌరవిద్దాం. అది చెప్పినట్లు నడుచుకుందాం’’ అనుకున్నాయి. ముందుగా ఏనుగు, ‘‘మిత్రులారా... నాకు ఈ మర్రి చెట్టు చిన్నప్పటి నుంచే తెలుసు. ఇది చిన్న చెట్టుగా ఉన్నప్పుడు నేను దీనిని ఒరుకుంటూ పోయేదాన్ని’’ అంది. ‘‘అలాగా, నేనైతే దీని పక్కన కూర్చొని కొమ్మ చివర్లలోని ఇగుర్లను తినేదాన్ని, నాకు ఈ చెట్టు మరీ చిన్న మొక్కగా ఉన్నప్పటి నుంచే తెలుసు’’ అంది కోతి. తిత్తిరి పిట్ట మౌనంగా ఉండిపోయింది. ‘‘ఏంటీ నువ్వేం మాట్లాడవు’’అన్నాయి ఏనుగు, కోతి. అప్పుడా తిత్తిరి పిట్ట, ‘‘మిత్రులారా! ఈ అడవి చివర ఒక మహా మర్రి ఉంది. నేను దాని పండును తిని, విత్తనాలను ఇక్కడ వదిలాను. ఆ విత్తనాల నుంచి వచ్చిందే మీరు చెబుతున్న మర్రిచెట్టు’’ అంది. శరీర ఆకారం కంటే, ఎక్కువ అనుభవ జ్ఞానం ఉన్న అతిచిన్నదైన తిత్తిరిపిట్టే తమకంటే పెద్దదని కోతి, ఏనుగు అంగీకరించాయి. ఆ నాటి నుంచీ అవి ఆ పిట్టను గౌరవిస్తూ, నమస్కరిస్తూ, దాని సలహా మేరకు జీవించాయి - అని బుద్ధుడు ఈ కథను ముగించి, ‘‘వృద్ధుల్ని మనం ఇందుకే గౌరవించాలి. వారు మనకంటే ఎక్కువ జ్ఞానాన్ని అనుభవం ద్వారా పొంది ఉంటారు కాబట్టి’’ అని చెప్పాడు. - బొర్రా గోవర్ధన్ -
అడవిలో అగ్నికీలలు
తగలబడుతున్న భారీ వృక్షాలు {పాణాలు కోల్పోతున్న వన్యప్రాణులు ఏటా 1500కు పైగా ప్రమాదాలు పర్యావరణానికి పెద్ద ఎత్తున చేటు కొయ్యూరు, న్యూస్‌లైన్: నిత్యం పచ్చగా కళకళలాడే తూర్పుకనుమల్లో అగ్గి రేగింది. సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడం తో విలువైన వృక్షాలతోపాటు వన్యప్రాణులు కాలిబూడిదవుతున్నాయి. జీకే వీధి మండలం దబ్బకోట ప్రాంతం, డుంబ్రిగుడకు సమీపంలోని పెద్దపాడు కొండలు మూడు రోజు లుగా కాలిపోతున్నాయి. పరి సర గ్రా మస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలి తం లేకపోతోంది. తామంతా అడవిలో వ్యవసాయ పనుల్లో ఉండగా మంటలు ఎగిసిపడితే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 53 శాతం విసీ ్తర్ణం కలిగి ఉన్న విశాఖ మన్యంలో అగ్నిప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నా యి. వేసవిలో ఆకురాల్చే చెట్లు తూర్పుకనుమల్లో ఎక్కువ. మార్చి-ఏప్రిల్ మధ్యలో ఈ రాలిన ఆకులు ఎండిపోతాయి. అడవి లోకి వెళ్లే గిరిజనులు లేదా పశువుల కాపరు లు ఆకులను తగులబెడతారు. దీంతో పక్క నే ఉన్న భారీవృక్షాలకు కూడా మంటలు తాకి విలువైన కలప బూడిదైపోతోంది. మన్యంలో ఐదున్నర లక్షల హెక్టార్లకు పైబడి అడవులు ఉన్నాయి. ఇందులో సు మారు లక్ష హెక్టార్లలో దట్టమైన అడవి ఉంది. కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకచోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అటవీ శాఖ పెద్దగా స్పందించడంలేదు. కొన్నిచో ట్ల ప్రమాదాల నివారణకు కొన్ని చోట్ల తవ్వకపోవడంతో ఇలాంటి దావానలం వ్యాపిస్తోంది. ఈ మంటల్లో కొన్నిచోట్ల ఔషధ మొక్కలు కూడా కాలిపోతున్నాయి. అటవీ శాఖ నివేదిక ప్రకారం ఏడాదిలో 1,500కు పైగా అగ్నిప్రమాదాలు అడవుల్లో చోటుచేసుకుంటున్నాయి. దాదాపు 30శాతానికి పైగా అడవులు అగ్నిప్రమాదంలో నష్టపోతున్నాయి. దీనికితోడు చెట్లను నరికి న తర్వాత మోడులను కాల్చడం కూడా అట వీ నాశనానికి కారణమవుతోంది. దీంతో వాతావరణ కాలుష్యం ఏర్పడడమేకాకుం డా వన్యప్రాణులు సైతం మరణిస్తున్నా యి. దీనిపై ‘న్యూస్‌లైన్’ నర్సీపట్నం డీఎ ఫ్వో లక్ష్మణ్‌ను సంప్రదించగా విశాఖమన్యంలో అంత ఎక్కువగా ప్రమాదాలు జరి గే అవకాశం లేదన్నారు. ప్రమాదం జరిగి నా ఎండిపోయిన ఆకులు కాలుతాయి త ప్ప చెట్లకు ప్రమాదం ఉండదన్నారు. శేషాచలం అడవులకు ఇక్కడి అడవులకు వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. -
అడవిమల్లె... ‘అవా!’
పామ్ చెట్లతో ముడిపడ్డ జీవనం వారిది. పక్షుల్లా స్వేచ్ఛగా ఎగిరే నైజం వారిది. జంతువులను కూడా బిడ్డల్లా సాకగలిగే హృదయం వారిది. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిలోనే కలిసిపోతున్న అచ్చమైన అడవి మల్లెలు ‘అవా’గిరిజన తెగ ప్రజలు. భూమిపై అంతరించిపోతున్న గిరిజన జాతుల్లో ప్రథమస్థానంలో ఉంది ‘అవా!’ భూమిపై ఇతర వ్యక్తులతో ఎలాంటి పరిచయాలనూ పెట్టుకోకుండా ఉన్న జాతి కూడా ‘అవా’ ఒక్కటే! 1800ల కాలంలో ఆంగ్లేయులను పోలినట్టుగా ఉండే ‘అవా’ తెగ ఆహార్యం అండమాన్‌లోని ‘జరావా’ జాతి వారి జీవనశైలికి దగ్గరగా ఉంటుంది. వివాహాలకు పరిమితి లేదు... ఈ తెగలో అందరికీ అందరితో బంధుత్వం ఉంటుంది. చిన్న చిన్న సమూహాలుగా ఉండే పెద్ద కుటుంబం వీరిది. ‘టుపి’ భాషలో మాట్లాడుకుంటారు. ఎంత దూరమైనా సమూహమంతా కలిసే వెళతారు. ‘అవా’ పురుషులు, స్త్రీలు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ లింగ వివక్ష లేదు. ‘అవా’ పురుషులు పెద్ద జంతువులను వేటాడితే.. స్త్రీలు చిన్నజంతువులను వేటాడతారు. అలాగే ఫలాలను సేకరించడం, పిల్లల పెంపకాలను ఈ తెగ స్త్రీ బాధ్యతగా తీసుకుంటుంది. ఆహారపదార్థాలను సేకరించడంలో సహాయపడే జంతువులను ‘అవా’ జాతి అమితంగా ప్రేమిస్తుంది. ముఖ్యంగా కోతులను జీవితంలో భాగం చేసుకుంటుంది ‘అవా’ మహిళ. ఎంతలా అంటే ఒక రొమ్మున తన బిడ్డకు పాలు ఇస్తూనే, మరో రొమ్మున కోతి పిల్లకు పాలుపడుతుంది. నలువైపులా చురుగ్గా శోధించే గద్దలనూ దగ్గరకు తీస్తుంది. వీటి సంజ్ఞల ఆధారంగా పొంచి ఉండే ప్రమాదాలను తెలుసుకుంటుంది. ఈ తెగ లో వయసులో పెద్ద అయిన మహిళ నాయకురాలిగా ఉండి, సలహాలు ఇస్తుం టుంది. వివాహాలను కుదర్చడం, ప్రసవ సమయంలో శిశువులను కాపాడటం ఈ నాయకురాలి విధి. ‘అవా’ జీవనవిధానం అంతా ద్రావిడ పద్ధతిలో ఉండటం విశేషం. అయితే తెగ నుంచి వేరయిన వారితో వీరు తిరిగి బంధుత్వాన్ని కొనసాగించలేరు. ఎందుకంటే అలా దూరమైన వారు తమ తెగ వారే అనే నమ్మకం లేకపోవడం వల్ల. ఆ విధంగానే ఈ తెగ అతి పెద్ద సమూహం నుంచి అతి చిన్న సమూహంగా మారి ఉంటుందని పరిశోధకుల అంచనా! పామ్ చెట్లతో అనుబంధం... దుస్తుల గురించి వారికి తెలియదు. పామ్ చెట్ల తీగలను, ఆకులను అల్లి అడ్డవస్త్రంగా ధరిస్తారు. పామ్ చెట్ల నుంచి తీసిన నారను తాడులా పేని, దానికి చిన్నచిన్న గవ్వలు గుచ్చి మెడలో ధరిస్తారు. పామ్ చెట్ల ఆకులతో బుట్టలు అల్లుతారు. పామ్ చెట్ల కొమ్మల నుంచి తీసిన నారతో గట్టి తాళ్లను పేనుతారు. పామ్ చెట్ల ఆకులతోనే త్రిభుజాకారంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారు. అడవిలో అత్యంత లాఘవంగా జంతువులను ఎలా వేటాడాలో, ఆహారాన్ని ఎలా సేకరించుకోవచ్చో ఈ తెగకు తెలుసు. కానీ, ఆధునిక మనుషుల అన్యాయాలను ఎదుర్కో వడం తెలియదు. దీనివల్లే ఆధునిక ప్రపంచం నుంచి మరింత దూరంగా వెళ్లిపోతోంది ఈ తెగ. వీరి సమస్యను చూస్తుంటే తల్లి గర్భం నుంచి వచ్చిన బిడ్డలు తిరిగి ఆ తల్లి గర్భంలోకే వెళుతున్నట్టుగా ఉంటుంది. సంక్షేమం తూర్పు, ఈశాన్య బ్రెజిల్లో భాగమైన అమెజాన్ అడవిలో ఉంది ‘అవా!’ తెగ. ప్రస్తుతం వారి సంఖ్య 350. మరో 100 మంది ఈ తెగతో వేరై ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేకుండా జీవిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలుసుకుంది. ‘అవా’ తెగను 1973లో మొదటిసారి బ్రెజిల్ ప్రభుత్వం గుర్తించింది. అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలకన్నా యురోపియన్ ఆక్రమణదారుల హింసాత్మక దాడులతో ‘అవా’ తెగ చిన్నాభిన్నమైపోయింది. ఈ పరిస్థితిని గమనించి ‘అవా’ తెగవారి సంక్షేమం కోస అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను రూపొందించింది. ‘అవా’తెగ జీవించడానికి అనువుగా గ్రామాలను ఏర్పాటుచేసింది. అయితే ఈ తెగవారు ప్రభుత్వ సహాయం తీసుకోవడం లేదు. తమ పూర్వపు సంస్కృతినే కాపాడుకుంటూ వస్తున్నారు.