ఇక్కడే బతుకుతం.. ఇక్కడే చస్తం
ఏటూరునాగారం : ప్రాణాలు పొయిన ఈ అడవి ఈడి ఏడికెల్లిపోం.. వలస వచ్చిన మా బతుకులను ఆగం చెత్తాండ్లు.. అడవిని నమ్ముకుని జీవి సున్నం. అటవీఅధికారులు ఇక్కడి నుంచి వెల్లగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. ఇక్కడే బతుకు తం.. ఇక్కడే చస్తం.’ అంటూ గొత్తికోయలు సోమవారం ఏటూరునాగారం మండలంలోని ఐటీడీఏ కార్యాలయూన్ని ముట్టడించారు. ఏటూరునాగా రం, మంగపేట, తాడ్వాయి మండలాలకు చెందిన వారు సుమారు వెయ్యి మంది రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు సున్నం బాబురావు మాట్లాడుతూ గొత్తికోయలపై దాడు లు చేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమో దు చేయాలని డిమాండ్ చేశారు.
అడవిలోని టేకు, జిట్రేగి, పెద్దేగి కర్రలను కొందరు అటవీశాఖ అధికారులే స్మగ్లర్లతో కుమ్మకై రవాణా చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం మండల కార్యదర్శి దావూ ద్, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటరెడ్డి, గిరి జన నాయకులు నారాయణ, కిష్టయ్య,నాగరాజు, ఆంజీ, వెంకన్న, చిట్టిబాబు, ముత్యాలు, నర్రాశివప్రసాద్, మడె రమేష్, గొత్తికోయలు నాగరాజు, జోగయ్య, ఆంజయ్య పాల్గొన్నారు. ఎస్సై వినయ్‌కుమార్ ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. పోడు భూములకు హక్కుపత్రాలివ్వాలని ఏపీఓ జనరల్ వసంతరావుకు గిరిజన నేతలు వినతిపత్రం అందజేశారు.