అడవిలో అగ్నికీలలు
- తగలబడుతున్న భారీ వృక్షాలు
- {పాణాలు కోల్పోతున్న వన్యప్రాణులు
- ఏటా 1500కు పైగా ప్రమాదాలు
- పర్యావరణానికి పెద్ద ఎత్తున చేటు
కొయ్యూరు, న్యూస్‌లైన్: నిత్యం పచ్చగా కళకళలాడే తూర్పుకనుమల్లో అగ్గి రేగింది. సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడం తో విలువైన వృక్షాలతోపాటు వన్యప్రాణులు కాలిబూడిదవుతున్నాయి. జీకే వీధి మండలం దబ్బకోట ప్రాంతం, డుంబ్రిగుడకు సమీపంలోని పెద్దపాడు కొండలు మూడు రోజు లుగా కాలిపోతున్నాయి. పరి సర గ్రా మస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలి తం లేకపోతోంది.
తామంతా అడవిలో వ్యవసాయ పనుల్లో ఉండగా మంటలు ఎగిసిపడితే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 53 శాతం విసీ ్తర్ణం కలిగి ఉన్న విశాఖ మన్యంలో అగ్నిప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నా యి. వేసవిలో ఆకురాల్చే చెట్లు తూర్పుకనుమల్లో ఎక్కువ. మార్చి-ఏప్రిల్ మధ్యలో ఈ రాలిన ఆకులు ఎండిపోతాయి. అడవి లోకి వెళ్లే గిరిజనులు లేదా పశువుల కాపరు లు ఆకులను తగులబెడతారు.
దీంతో పక్క నే ఉన్న భారీవృక్షాలకు కూడా మంటలు తాకి విలువైన కలప బూడిదైపోతోంది. మన్యంలో ఐదున్నర లక్షల హెక్టార్లకు పైబడి అడవులు ఉన్నాయి. ఇందులో సు మారు లక్ష హెక్టార్లలో దట్టమైన అడవి ఉంది. కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకచోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అటవీ శాఖ పెద్దగా స్పందించడంలేదు. కొన్నిచో ట్ల ప్రమాదాల నివారణకు కొన్ని చోట్ల తవ్వకపోవడంతో ఇలాంటి దావానలం వ్యాపిస్తోంది.
ఈ మంటల్లో కొన్నిచోట్ల ఔషధ మొక్కలు కూడా కాలిపోతున్నాయి. అటవీ శాఖ నివేదిక ప్రకారం ఏడాదిలో 1,500కు పైగా అగ్నిప్రమాదాలు అడవుల్లో చోటుచేసుకుంటున్నాయి. దాదాపు 30శాతానికి పైగా అడవులు అగ్నిప్రమాదంలో నష్టపోతున్నాయి. దీనికితోడు చెట్లను నరికి న తర్వాత మోడులను కాల్చడం కూడా అట వీ నాశనానికి కారణమవుతోంది.
దీంతో వాతావరణ కాలుష్యం ఏర్పడడమేకాకుం డా వన్యప్రాణులు సైతం మరణిస్తున్నా యి. దీనిపై ‘న్యూస్‌లైన్’ నర్సీపట్నం డీఎ ఫ్‌వో లక్ష్మణ్‌ను సంప్రదించగా విశాఖమన్యంలో అంత ఎక్కువగా ప్రమాదాలు జరి గే అవకాశం లేదన్నారు. ప్రమాదం జరిగి నా ఎండిపోయిన ఆకులు కాలుతాయి త ప్ప చెట్లకు ప్రమాదం ఉండదన్నారు. శేషాచలం అడవులకు ఇక్కడి అడవులకు వ్యత్యాసాలు ఉన్నాయన్నారు.