
అమెరికాలో భారీ భూకంపం
అలస్కా: అమెరికాలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. అలస్కా దక్షిణ తీర ప్రాంతంలో రెక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియలాజికల్ సర్వే విభాగం ప్రకటించింది. పెడ్రో అఖాతానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూకంపం దాటికి తమ నివాసప్రాంతంలో ప్రకంపణలు గుర్తించామని పలువురు ఆంకోరేజ్ పట్టణ వాసులు ట్విట్టర్లో తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టాలు నమోదు కాలేదు. భూమిలోపల 124 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సునామీ భయంలేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.