ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలోని ఉత్తర అలస్కా ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపతీవ్రంత 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్ జియోగ్రాఫికల్ సర్వే ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు ఇంకా సమాచారం అందలేదు.
ఇంత తీవ్రతతో భూకంపం సంభవించడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. 1995లో వచ్చిన భూకంపమే(5.2 మాగ్నిట్యూడ్) ఇప్పటి వరకు అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన తర్వాత పలుమార్లు ప్రకంపనలు కూడా వచ్చాయని జియోగ్రాఫికల్ సర్వే అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment